Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి

పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి .. పవన్ రాజకీయాలపై ‘రామ్’ గారి మార్క్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: NARESH, Updated On : February 7, 2024 2:20 pm

Pawan Kalyan : 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రేరణగా.. శక్తిగా.. ఆశాదీపంగా ప్రజలకు కనపడ్డారు. తన ప్రత్యామ్మాయ ఆలోచనలు ప్రజలను ఆలోచింప చేశాయి. కుండమార్పిడి అధికారం పోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఎంతో మందిని ఆకర్షించింది. క్రమక్రమంగా ప్రజలకు పవన్ పైన గురి పెరిగింది.

2019 ఎన్నికలకు ముందు పవన్ ను జనాలు పట్టించుకోలేదు. 2019 ఎన్నికల తర్వాత పవన్ తీసుకున్న ప్రత్యామ్మాయ రాజకీయాల ఆలోచనలు, మిగతా కార్యక్రమాలతో ప్రజల్లో పవన్ ఫెయిత్ చాలా పెరిగింది. పవన్ పై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నమ్మారు.

దురదృష్టం ఏంటంటే 2019 ఎన్నికలు పీడకలగానే పవన్ కు మారాయి. నన్ను ఓడించారు. జనాలు ఓడించారు అంటూ జనాలను పవన్ నమ్మడం లేదు. జనాలు ఇప్పటికీ తనను అలాగే భావిస్తున్నారని పవన్ నమ్ముతున్నారు. ఇదే పెద్ద తప్పటడుగుగా చెప్పొచ్చు. రెండోది ఇప్పటం మహాసభలో తృత్రీయ ప్రత్యామ్మాయ క్తిగా ఎదుగుతున్న దశలో.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మైనస్ గా మారింది. ఇద్దరికీ ప్రత్యామ్మాయ పోటీగా ఎదుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ఆశచూపడం పవన్ చేసిన రెండో పెద్ద తప్పు.

పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి .. పవన్ రాజకీయాలపై ‘రామ్’ గారి మార్క్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు