https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు ఆ సూపర్ హిట్ సినిమాలో తనకి తండ్రి గా కృష్ణ చేస్తే నేను ఆ సినిమా చేయను అని చెప్పాడా..?కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 29, 2024 / 09:02 AM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మహేష్ బాబు కూడా మొదట్లో స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చుకోవాలి అని అనుకున్నప్పటికి ఇప్పుడు మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడంలో ఆయన చాలా వరకు బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…

    సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు సూపర్ స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా మంచి సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో మహేష్ బాబు చేసిన రెండు మూడు సినిమాల్లో కృష్ణ తన ఫాదర్ గా నటించాడు. అయితే ఆ సినిమాలు మంచి విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. ఇక దాంతో దూకుడు సినిమాలో కృష్ణ గారిని ఫాదర్ క్యారెక్టర్ లో తీసుకుంటానని శ్రీనువైట్ల చెప్పాడట. కానీ మహేష్ బాబు మాత్రం వద్దని ఆయన తన ఫాదర్ క్యారెక్టర్ లో నటిస్తే సినిమా చేయనని చెప్పారట. కారణం ఏంటంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

    కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాడని ఆ సెంటిమెంట్ ని నమ్మే మహేష్ బాబు కృష్ణ గారిని తన తండ్రి పాత్రలో చేయొద్దని చెప్పారట. ఇక దాంతో ప్రకాష్ రాజుని మహేష్ బాబు తండ్రి పాత్రలో తీసుకొని ఆ సినిమా చేయడంతో దూకుడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక మొత్తానికైతే మహేష్ బాబు కృష్ణ కాంబినేషన్ లో ఈ సినిమా రాకపోవడం వల్లే సూపర్ సక్సెస్ అయిందని కొంతమంది నమ్ముతూ ఉంటారు.

    కాబట్టి ఏది ఏమైనా కూడా తండ్రీ కొడుకులు అయిన కూడా కొన్ని విషయాల్లో అది వర్కౌట్ అవ్వదు అని చెప్పడానికి ఈ సినిమాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కు సంభందించిన పనులను చూసుకుంటూ ఆయన ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.

    ఇక ఈ సినిమా మేకోవర్ కోసమే దాదాపు సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్న మహేష్ బాబు ఎట్టకేలకు ఒక లుక్ సెట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాని ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటాలంటే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలసిన అవసరం అయితే ఉంది…