Puri Jagannadh
Puri Jagannadh : సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ డైరక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఇప్పుడున్న డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా తనకంటూ స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఈ దర్శకుడు రీసెంట్ గా చేసిన చాలా సినిమాలు ప్లాప్ లుగా మిగులుతున్నాయి. దానివల్ల స్టార్ హీరోలు ఎవరు అతనికి అవకాశాలు ఇవ్వడం లేదు. ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా కొంతమంది ఆయన పేరు చెప్తేనే భయపడిపోతున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఆయన చాలామంది హీరోలకి మంచి విజయాలను అందించాడు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆయన సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ఆయన గత కొద్దిరోజుల నుంచి తన ఫామ్ ను ఏమాత్రం అందుకోవడం లేదు. వరుసగా రెండు సినిమాలతో డిజాస్టర్లను మూటగట్టుకున్న ఆయన ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయనకు అవకాశం ఇచ్చే హీరో ఎవరు అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.. ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి కొంతమంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఆ సినిమా సక్సెస్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే ఒక చిన్న డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ పూరి జగన్నాధ్ తో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ కూడా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. రీసెంట్ గా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన విశ్వం సినిమా కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
దాంతో ఆయన కొంతవరకు డిసప్పాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాలు చేస్తే గోపీచంద్ కెరియర్ ఉంటుందా? లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందే గోపీచంద్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో గోలీమార్ అనే సినిమా వచ్చింది.
అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయన కెరియర్ లోనే అప్పటి వరకు ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. మరి ఈ సినిమాతో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో అలాంటి సినిమా పడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…