Rajinikanth: కుమార్తెలే రజినీకాంత్ కెరీర్ ను దెబ్బతీశారా?

ధనుష్ భార్య ఐశ్వర్య డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ని కొనసాగిస్తుండగా ఇటీవలే తన తండ్రి నమ్మకాన్ని సంపాదించుకొని లాల్ సలామ్ అనే సినిమాకు డైరెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కన్నా ముందు ఆమె మరో మూడు సినిమాలను డైరెక్ట్ చేసింది.

Written By: Swathi, Updated On : February 20, 2024 1:08 pm

Rajinikanth

Follow us on

Rajinikanth: రజినీకాంత్ కెరీర్ కండక్టర్ గా మొదలై సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సౌత్ ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న హీరో రజినీకాంత్. 70 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈయన సినిమాలు ఇప్పటికీ హిట్ ను సొంతం చేసుకుంటాయి. రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈయనకు ఇద్దరు కుమార్తెలు. కానీ వీరి వల్లే కాస్త రజినీకాంత్ కెరీర్ ఢీలా పడింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓవైపు ఆధ్యాత్మిక చింతన మరోవైపు సినిమాలు ఇలా ఈయన కెరీర్ సూపర్ గా నడుస్తుంది. అయితే ఈయనకు ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొని సెటిల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. సౌందర్య పెళ్లి చేసుకొని విడాకులు తర్వాత మరొక వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక ఐశ్వర్య హీరో ధనుష్ తో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. వీరి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా సినిమాల జీవితం విషయానికి వస్తే.. ఇద్దరు కూడా ఇండస్ట్రీకి డైరెక్టర్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

ధనుష్ భార్య ఐశ్వర్య డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ని కొనసాగిస్తుండగా ఇటీవలే తన తండ్రి నమ్మకాన్ని సంపాదించుకొని లాల్ సలామ్ అనే సినిమాకు డైరెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా కన్నా ముందు ఆమె మరో మూడు సినిమాలను డైరెక్ట్ చేసింది. మొదట తన భర్త ధనుష్, శృతిహాసన్ లను మెయిన్ లీడ్ గా పెట్టి త్రీ అనే సినిమాను తెరకెక్కించింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు చేయగా ఆమె తీసిన లాల్ సలామ్ పరాజయాన్ని చవిచూసింది. ఇక మరో కూతురు సౌందర్య మొదటి నుంచి గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తుంది.

ఆమె డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా మారి సినిమానే పూర్తి కెరీర్ గా ఎంచుకుంది. తండ్రిని హీరోగా పెట్టి కొచ్చాడియన్ అని ఒక యానిమేటెడ్ సినిమాను కూడా ఆమె తెరకెక్కించింది. కానీ ఇది కూడా పరాజయాన్ని చవిచూసింది. ఇలా ఇద్దరు కుమార్తెలను నమ్మి సినిమాను అప్పగించిన రజినీకాంత్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. ఇలా ఇద్దరు కుమార్తెల వల్ల రజినీ తన కెరీర్ లో ఫ్లాప్ లను ఎదుర్కొన్నారు. ఏది ఏమైనా వీటినే పాఠాలుగా మలచుకొని ముందు ముందు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.