VV Vinayak: వి. వి. వినాయక్ గాల్లోకి సుమోలను లేపడానికి కారణం ఏంటో తెలుసా..?

మొదటి సినిమా తోనే తన మార్క్ డైరెక్షన్ ని చూపిస్తూ స్టార్ హీరోలను సైతం ఆకట్టుకున్నాడు. ఆది సినిమాలో సుమోలు గాల్లోకి లేవడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. అప్పటినుంచి చాలా సినిమాల్లో ఇలాంటి ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది.

Written By: Gopi, Updated On : February 20, 2024 1:04 pm
Follow us on

VV Vinayak: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క జానర్ లో సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అయి ఉంటారు. వాళ్లు ఏ జానర్ లో స్ట్రాంగ్ గా ఉంటారో ఆ జానర్ ల్లోనే సినిమాలను చేస్తూ చాలా ఈజీగా కథలను డీల్ చేస్తూ హీరోలకి వరుస సక్సెస్ లను ఇస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ‘కళాతపస్వి కె విశ్వనాథ్’ గారు ఆర్ట్ సినిమాలు తీయడంలో మంచి పేరు సంపాదించుకున్నారు. రాఘవేంద్రరావు లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలు చేయడంలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు.

ఇక ఇప్పుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీస్తూ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక వీళ్ళ అందరిదీ ఒకెత్తు అయితే అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వివి వినాయక్ గారిది మరొక ఎత్తు. ఈయన ఫ్యాక్షన్ సినిమాలను డీల్ చేయడంలో అందవేసిన చేయిగా అప్పట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తోనే తన మార్క్ డైరెక్షన్ ని చూపిస్తూ స్టార్ హీరోలను సైతం ఆకట్టుకున్నాడు. ఆది సినిమాలో సుమోలు గాల్లోకి లేవడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. అప్పటినుంచి చాలా సినిమాల్లో ఇలాంటి ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది.

అయితే ఈ ట్రెండ్ కి సృష్టికర్త అయిన వివి వినాయక్ సుమోలు లేపడానికి అసలు కారణం ఏంటి అంటే, ఆయన చిన్నతనం లో కార్లను చూసినప్పుడు రోడ్డుమీద కార్లు ఇంత బాగా వెళుతున్నాయి కదా, ఒకసారి ఇవి గాల్లోకి లేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడట,ఇక అలాగే ఒకేసారి ఒక నాలుగు కార్లు గాల్లోకి లేస్తే ఎలా ఉంటుంది, అనేది ఇమేజేనేషన్ చేసుకొని తను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఆ ఐడియా వచ్చి సుమోలను గాల్లోకి లేపారట.

దాంతో అది హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయడానికి యూజ్ అయింది. ఇక అందుకే అప్పటినుంచి ఆయన సినిమాల్లో దాదాపు సుమోలను పైకి లేపుతూనే వచ్చాడు. వినాయక్ తన సుమోలు లేపడం వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు…