Indian Toilet Vs Western Toilet: మలవిసర్జనకు వెళ్లాలంటే అందరూ బహిరంగ మల విసర్జననే చేయాల్సి వచ్చేది. ఎవరి ఇంట్లో కూడా మరుగుదొడ్ల సదుపాయం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాల ప్రోత్సాహంతో నెమ్మదిగా గ్రామానికి ఒక మరుగుదొడ్డి వచ్చింది. ఆ తర్వాత ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ వచ్చేసింది. ప్రస్తుతం అయితే బెడ్ రూమ్ లో ఒకటి, ఇంటి బయట ఒకటి అంటూ రెండు మూడు ఉపయోగిస్తున్నారు. మరి ఈ టాయిలెట్ల నిర్మాణంలో ఇండియన్ టాయిలెట్ల సదుపాయం, వెస్ట్రన్ టాయిలెట్ల సదుపాయం రెండు ఉన్నాయి. చాలా మంది రెండింటిని ఉపయోగిస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెటరో చూసేయండి.
ఇండియన్ టాయిలెట్స్.. ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల వ్యాయామం అవుతుంది. అవును మీరు విన్నది నిజమే.. దీని కూర్చోవడం, నిలబడటం చేస్తారు కాబట్టి రోజువారీ వ్యాయామం అవుతుంది. దీని వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. చేతులు కాళ్లకు వ్యాయామం అవుతుంది కాబట్టి చాలా మంచిది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు మీద ఒత్తిడి వచ్చి.. మల విసర్జన సరిగ్గా అవుతుంది. ఈ ఇండియన్ టాయిలెట్స్ వల్ల గర్భిణీ స్త్రీల వల్ల మరింత మంచిది. వీటి వల్ల ప్రసవం సాఫీగా, సులువుగా అవుతుందట.
వెస్ట్రీన్ టాయిలెట్స్.. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి మరింత సౌకర్యం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చాలా ఉపశమనం ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉండే వారు ఉపయోగిస్తే నష్టాలే ఎక్కువట. ఈ టాయిలెట్స్ వల్ల ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. అతిసారం, కడుపు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వెస్ట్రన్ టాయిలెట్ చర్మానికి తగిలి.. క్రిములు, బ్యాక్టీరియాను వ్యాప్తి చెందేలా చేస్తాయి. దీని వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ వీటిని ఉపయోగించాలి అనుకుంటే.. ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్ గా ఉంచుకోండి.