Ghaati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటి అనుష్క… బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేసిన ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని తీవ్రమైన ప్రయత్నమైతే చేసింది. మరి దానికి తగ్గట్టుగానే ఆమె అడపదడప సినిమాలు చేసినప్పటికి అవేబి ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. ఇక దాంతో క్రిష్ డైరెక్షన్ లో చేసిన ‘ఘాటీ’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు…అయితే ఈ సినిమాను అనుష్క చేస్తున్నప్పుడే ఆమెకు ఈ సినిమా పెద్దగా ఆడదనే విషయమైతే తెలిసిపోయిందట.
కానీ క్రిష్ ఫోర్స్ మేరకు సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా అనుష్క ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను అలరించడం లేదు. మరి ఈ సినిమాతో అయిన ప్రేక్షకులను మెప్పిస్తుందేమో అని తమ అభిమానులందరూ అనుకున్నప్పటికి ఆశించిన మేరకు వర్కౌట్ అయితే కాలేదు…
ఈ సినిమా ముందుగానే ఫ్లాప్ అవుతుంది అని తెలుసుకున్న అనుష్క రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదట. మొత్తానికైతే ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక తాను ఫ్యూచర్లు చేయబోతున్న ప్రాజెక్ట్ ల గురించి ఇప్పుడు అప్పుడే అనౌన్స్ చేయనని దానికి కొంత సమయం ఉందని వీలైతే ఆ సమయం తీసుకున్న తర్వాతే ఒక మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తానని ఆమె చెబుతుండటం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట అనుష్క చేయబోయే సినిమాలు సూపర్ సక్సెస్ సాధించే విధంగా ఉండాలి తప్ప డిజాస్టర్ అయ్యే సినిమాలను చేయకూడదు అంటూ తమ అభిమానులు సైతం అనుష్కకి కొన్ని మెసేజ్ లైతే పెడుతున్నారట. మరి ఇలాంటి క్రమంలోనే అనుష్క సైతం ఓవర్ వెయిట్ గా మారిపోయింది. ఆమె వెయిట్ తగ్గితే గాని ఆమెని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు అనేది వాస్తవం…