Rajamouli Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో గొప్ప గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటికే ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను అందుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలైతే లీక్ అయ్యాయి. మరి ఈ ఫోటోలను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మహేష్ బాబు సింహంతో ఫైట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మహేష్ బాబుకు డూప్ కూడా లేకుండా తనతోనే ఈ ఫైటింగ్ చేయించాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఉన్నాడట. మరి దానికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహేష్ బాబు చేత భారీ ఫైట్ అయితే చేయిస్తున్నారు. నిజానికి సింహంతో ఫైట్ చేస్తే అది సీజీ లో ఉంటుందని మనందరికి తెలుసు…
కానీ రియల్ సింహంతో మహేష్ బాబు ఫైట్ చేయబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ లో గొప్ప విజయాన్ని సాధించి తన ఖాతాలో భారీ సక్సెస్ ని వేసుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది… ఇక అందుకే రాజమౌళి సైతం మహేష్ బాబు చేత ఓన్ గా స్టంట్స్ చేయించి దాన్ని కూడా ప్రమోషన్స్ లో భాగంగా వాడుకొని ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ రేంజ్ లో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…