https://oktelugu.com/

Akhil Akkineni : అఖిల్ ఇంటి పేరు బలవంతంగా మార్చేసారా..! ఎందుకు అలా జరిగింది?

అఖిల్ ని అందరూ అయ్యగారు అంటూ పిలుస్తూ వచ్చారు.ఈ అయ్యగారు అనే పిలుపు మీకు ఎలా అనిపిస్తుంది అంటూ అక్కడికి వచ్చిన అమ్మాయి అఖిల్ ని అడగగా, అఖిల్ దానికి సమాధానమిచ్చారు

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2023 / 10:24 PM IST
    Follow us on

    Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవుతుంది.ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంది.దానికి తోడు రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచేలా చేసింది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది.

    మొదటి రోజు ఓపెనింగ్ ఆశించిన రేంజ్ వచ్చినా రాకపోయినా అఖిల్ కెరీర్ లో టాప్ 3 బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని చెప్పొచ్చు.ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అక్కినేని అఖిల్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, వీటిలో స్టూడెంట్స్ తో ఆయన చేసిన చిట్ చాట్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

    ఈ ఇంటరాక్షన్ లో ఒక అమ్మాయి ‘అయ్యగారే నెంబర్ 1 ‘ అనే వీడియో ని ప్లే చేసి అఖిల్ కి చూపించారు.గతం లో అఖిల్ హీరో గా నటించిన ‘హలో’ అనే చిత్రాన్ని చూసి బయటకి వస్తున్న సమయం లో మీడియా ముందు ఒక అభిమాని అఖిల్ నెంబర్ 1 అంటూ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.

    అప్పటి నుండి అఖిల్ ని అందరూ అయ్యగారు అంటూ పిలుస్తూ వచ్చారు.ఈ అయ్యగారు అనే పిలుపు మీకు ఎలా అనిపిస్తుంది అంటూ అక్కడికి వచ్చిన అమ్మాయి అఖిల్ ని అడగగా, అఖిల్ దానికి సమాధానం ఇస్తూ ‘నన్ను అప్పటి నుండి అందరూ అయ్యగారు అనే పిలుస్తున్నారు.నా పేరు నా ఇంటి పేరు కూడా అందరూ మర్చిపోయి ఉంటారు’ అంటూ అఖిల్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.