https://oktelugu.com/

Akhil Akkineni: రాజమౌళి-మహేష్ మూవీలో నటిస్తావా? అఖిల్ అదిరిపోయే ఆన్సర్!

'రాజమౌళి-మహేష్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మీకు ఓ కీలక రోల్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అఖిల్.... ఊహాగానాల గురించి ఇప్పుడెందుకు చెప్పండి. రాజమౌళి, మహేష్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు. ఇక రాజమౌళి మూవీలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి, అన్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2023 / 09:10 AM IST
    Follow us on

    Akhil Akkineni: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబుతో ప్రకటించిన చిత్రం గురించి పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ కనిపిస్తున్నారని తెలుస్తుంది. జానర్ విషయంలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఇక మహేష్ పాత్రకు రామాయణంలో హనుమంతుడు పాత్ర స్ఫూర్తి అని జరుగుతున్న ప్రచారాన్ని రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఖండించారు. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఆర్ ఆర్ ఆర్, బాహుబలి చిత్రాలకు మించి అనేది సుస్పష్టం.

    ఈ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న యంగ్ హీరో అఖిల్ కి ఎదురైంది. ఏజెంట్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ యాంకర్… ‘రాజమౌళి-మహేష్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మీకు ఓ కీలక రోల్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అఖిల్…. ఊహాగానాల గురించి ఇప్పుడెందుకు చెప్పండి. రాజమౌళి, మహేష్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు. ఇక రాజమౌళి మూవీలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి, అన్నాడు.

    కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అఖిల్ చెప్పకనే చెప్పాడు. అఖిల్ కెరీర్లోనే ఏజెంట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఆయన రా ఏజెంట్ గా నటిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. ఒక్క కమర్షియల్ హిట్ కొట్టి మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవాలనుకుంటున్న అఖిల్ ఏజెంట్ చిత్రం మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.

    సురేందర్ రెడ్డి-అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ అనుకున్న సమయం కంటే డిలే అయ్యింది. ఈ క్రమంలో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఏజెంట్ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. కాకినాడలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేశారు.