https://oktelugu.com/

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ముందుగా చెట్టును పెళ్లి చేసుకుందా?

ఐశ్వర్యరామ్ ముందుగా ఓ పెళ్లి చేసుకున్న తర్వాతనే అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుందనే టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 2, 2023 / 02:58 PM IST

    Aishwarya Rai

    Follow us on

    Aishwarya Rai: సౌత్, నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ ఐశ్వర్యరాయ్. ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పడానికి ఈమె పేరును కూడా వాడుతుంటారు ప్రజలు. అయితే తాజాగా తన 50వ పుట్టిన రోజు గ్రాండ్ గా జరుపుకుంది ఈ అమ్మడు. 50 సంవత్సరాలు ఉన్నా కూడా పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే గతంలో ఐశ్వర్యరాయ్ పెళ్లి గురించి ఓ ప్రచారం జరిగింది. అది కాస్త ఆమె అభిమానులను చాలా ఇబ్బంది పెట్టింది. ఇంతకీ ఏంటి ఆ వైరల్ న్యూస్ అనుకుంటున్నారా?

    ఐశ్వర్యరామ్ ముందుగా ఓ పెళ్లి చేసుకున్న తర్వాతనే అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుందనే టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఐశు మొదటి పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. అయితే ధూమ్ 2 సినిమాలో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించింది. ఇదే సినిమాతో ఇద్దరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.ఇక ఐశ్వర్యరాయ్ జాతకంలో దోషం ఉండడం వల్ల బచ్చన్ ఫ్యామిలీ ముందుగా ఐశ్వర్యకు చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత వీరిద్దరికి పెళ్లి చేశారు అనే టాక్ ఉంది.

    ఈ వార్తపై రెండు ఫ్యామిలీలు కూడా స్పందించలేదు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో అసలు ఈ వార్తపై స్పందించాలనే ఇష్టం కూడా లేదని.. అయినా నాకు సోషల్ మీడియాలో పెళ్లి ప్రచారం చేసినవాళ్లే ఆ చెట్టు వివరాలు చెప్పాలంటూ నవ్వింది. అంతే కాదు ఆ చెట్టు అభిషేక్ కావచ్చు అంటూ కూడా తెలిపింది. ఇలా ఎటకారంగా స్పందించడంతో ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. మొత్తం మీద ఐశ్వర్య రాయ్ చెట్టుతో పెళ్లిచేసుకోలేదని.. కేవలం అభిషేక్ నే పెళ్లి చేసుకుందని ఈమె మాటలతో క్లారిటీ వచ్చేసింది.