Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8కు ఆ స్టార్ హీరో ఫిక్స్? నాగార్జున సీట్ కు ఎసరు పెట్టిన ఆ హీరో ఎవరు?

సీజన్ 8 కోసం హోస్ట్ ను మారుస్తున్నట్టు.. దానికి బాలయ్యను ఫిక్స్ చేసినట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే తర్వాత నుంచి వచ్చే బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగ్ ఊహించని రేంజ్ లో ఉంటుంది అంటున్నారు బాలయ్య అభిమానులు.

Written By: Suresh, Updated On : November 2, 2023 3:03 pm

Bigg Boss Season 8 Telugu

Follow us on

Bigg Boss Season 8 Telugu: రియాలిటీ షోలలో కింగ్ బిగ్ బాస్ దే ప్రత్యేక స్థానం. ట్రోలింగ్ లు, కామెంట్లు ఎన్ని వచ్చినా కూడా అన్నింటికి తట్టుకొని ధీటుగా నిలబడుతుంది. అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుంటుంది ఈ షో. ఇక మొదటి సీజన్ లకు ఎన్టీఆర్, నానిలు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున కంటిన్యూగా ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే మొదటి రెండు సీజన్లు ఆకట్టుకున్న రేంజ్ లో తర్వాత సీజన్ లు ఆకట్టుకోవడం లేదని టాక్. ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీజన్ 7 మరింత డల్ గా ఉందని డిజిటల్ టాక్. అంతేకాదు తమిళ్, హిందీ బిగ్ బాస్ లకంటే తెలుగు బిగ్ బాస్ కాస్త వెనకబడిన విషయం తెలిసిందే.

ఇక సీజన్ 8 కోసం హోస్ట్ ను మారుస్తున్నట్టు.. దానికి బాలయ్యను ఫిక్స్ చేసినట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే తర్వాత నుంచి వచ్చే బిగ్ బాస్ షో టీఆర్పీ రేటింగ్ ఊహించని రేంజ్ లో ఉంటుంది అంటున్నారు బాలయ్య అభిమానులు. ఈయన సూటిగా, నిర్మొహమాటంగా, ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటాడు కాబట్టి సీజన్ 8 దబిడిదిబిడే అంటున్నారు కొందరు. ఇక ఈయన స్టేజ్ షోలపైకి, సినిమా ప్రమోషన్ లకు వస్తేనే ఏదో రచ్చ చేస్తుంటారు. ఈయన క్లాస్ పీకే తీరే భయం లేని తనంతో బిగ్ బాస్ టీఆర్పీ ఊహించని రేంజ్ లో ఉండడం కామన్ అంటున్నారు కొందరు. ఇక ఈయనతో ఉన్న చనువు వల్ల సెలబ్రెటీలు కూడా వస్తారు అనే టాక్ ఉంది.

అధికారికంగా ఈ వార్తపై ఎలాంటి సమాచారం లేదు. కానీ నిప్పు లేనిదే పొగరాదు అనేది తెలిసిందే. ఆహాకు బాలకృష్ణ వల్లనే మైలేజ్ పెరిగిందనే టాక్ ఉంది. అందుకే హాట్ స్టార్ నిర్వాహకులు కూడా ఈ సారి హోస్ట్ ను మార్చాలి అనుకుంటున్నారట. పైగా నాగార్జున కూడా తన వందవ సినిమా నా సామి రంగాతో బిజీ కానున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత అన్నపూర్ణ బ్యానర్ పై వరస సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. దీంతో బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య రావడం పక్కా అంటున్నారు.. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.