Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్…ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ దర్శకుడి విజన్ చాలా బాగుంటుంది. అందుకే ఇండియాలో ఆయనలంటి డైరెక్టర్ మరొకరు లేరు అనేంతల గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేసిన కేజీఎఫ్ సినిమా డార్క్ మోడ్ లో ఉండడమే కాకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎలివేషన్స్ తో కూడుకొని ఉంటుంది. దాని వల్ల ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక కేజీఎఫ్ 2 సినిమా కూడా సేమ్ అదే ఫార్మాట్లో ఉండడం వల్ల ఆ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా కూడా సేమ్ అదే రీతిలో సాగుతుంది. దానివల్ల ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న డ్రాగన్ సినిమా కూడా అదే బాటలో ఉంటుందట. ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ అంటే తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఒక సెపరేట్ ఐడెంటిటీ ని కూడా సంపాదించుకున్నాడు. మరి అలాంటి దర్శకుడు ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా తన గత చిత్రాల మాదిరిగానే ఉంటాయి అనే వార్తలు రావడంతో సినీ విశ్లేషకులు సైతం కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడూ ఒకే టైపు ఆఫ్ సినిమాలను చేస్తుంటే ప్రేక్షకులకు బోర్ కొట్టే అవశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు జానర్స్ ను మారుస్తూ సినిమాలు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ నీల్ ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఆయన కెరియర్ అనేది ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోవచ్చని వాళ్ళు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక వరుసగా ఇలాంటి సినిమాలు కనక చేసినట్లయితే మరో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఆయన ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఒకే టైప్ ఆఫ్ సినిమాలను చూపిస్తూ ఉంటే వాళ్లకు బోర్ కొడుతూ ఉంటుంది.
కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా అప్పుడప్పుడు కథనుగాని, స్క్రీన్ ప్లేన్ గాని మారుస్తూ ఒక స్పెషలైజేషన్ ఇస్తూ ముందుకు సాగడం మంచిదని కొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ మాత్రం తనకు అచ్చొచ్చిన ఫార్ములానే నమ్ముకుంటూ ముందుకు సాగుతానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడాలి మరి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది…