Dhurandhar: ఒక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించినప్పుడు, దాని గురించి ప్రశంలతో పాటు, విమర్శలు కూడా ఉంటాయి. కానీ రీసెంట్ గా విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ‘ధురంధర్’ సిరీస్ కి మాత్రం ఎవ్వరూ కూడా ఎలాంటి వంకలు పెట్టలేదు. ఆ చిత్రానికి సంబంధించిన స్క్రీన్ ప్లే , స్టోరీ , నటీనటుల నటన ఆ రేంజ్ లో ఉంది మరీ. క్రాఫ్ట్స్ మీద ఎలాంటి వంకలు చూపించే అవసరం లేకపోవడం తో , ఇప్పుడు కొంతమంది నేరుగా రణవీర్ సింగ్ నే టార్గెట్ చేస్తున్నారు. పలు విషయాల్లో ఆయన్ని టార్గెట్ చేసి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై aa చిత్రం లో నటించిన ప్రముఖ నటుడు గౌరవ్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా లో జరిగే ఈ ప్రచారాలను ఆయన కొట్టిపారేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ పడేటప్పుడు ‘రణవీర్ సింగ్ వ్యాన్’, ‘రణవీర్ సింగ్ స్టాఫ్ వ్యాన్’, ‘రణవీర్ సింగ్ నార్మల్ వ్యాన్’ అంటూ షూటింగ్ కోసం ఆయన మూడు క్యార వ్యాన్ లు వాడాడు , నిర్మాతలను ఆయన ఈ రేంజ్ లో వేధించి , విపరీతంగా ఖర్చు చేయించాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. దీనిపై గౌరవ్ చాలా ఘాటుగానే స్పందించాడు. రీసెంట్ గానే ఆయన ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహిస్తున్న ఒక టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో ఫరా ఖాన్ సోషల్ మీడియా లో జరిగే ఈ ప్రచారాన్ని గౌరవ్ దృష్టికి తీసుకొచ్చింది. దానికి గౌరవ్ స్పందిస్తూ ‘నేను రణవీర్ సింగ్ తోనే షూటింగ్ జరిగినన్ని రోజులు ఉన్నాను. నేను అయితే ఆయా అన్ని వ్యాన్ లు ఉపయోగిస్తున్నట్టు చూడలేదు’.
‘రణవీర్ సింగ్ చాలా సరదా మనిషి , అందరితోనూ చాలా సరదాగా ఉండేవాడు. చిన్న నటుడు పెద్ద నటుడు అనే తేడా చూపడు. నాతో కూడా చాలా ఫన్నీ గా ఉండేవాడు. షూటింగ్ బ్రేక్ సమయంలో , ఫన్నీ వాయిస్ తో ‘చుటికీ , నువ్వు కూడా నాతో పాటు వాష్ రూమ్ కి వస్తావా’ అని ఆట పట్టించేవాడు. అంతటి అల్లరి , ఫన్ చేసేవాడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి రూమర్స్ రావడం దురదృష్టకరం. దయచేసి విమర్శించొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు గౌరవ్. ఇకపోతే ‘ధురంధర్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే , ‘ధురంధర్ 2’ కి 1840 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ఈ నెల 15 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.