Dhurandhar movie : గత ఏడాది డిసెంబర్ 4 ని బాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే సౌత్ నుండి వరుసగా క్రేజీ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లోకి కూడా ఆ సినిమాలు అడుగుపెట్టి, అక్కడి ఆడియన్స్ ని కూడా తమవైపుకు తిప్పుకుంటున్నాయి. అలాంటి సమయం లో వచ్చిన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. ఓటీటీ లోకి ఈ చిత్రం అడుగుపెట్టి వారం రోజులు అవుతోంది. అయినప్పటికి ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుండడం చిన్న విషయం కాదు. సింగిల్ వెర్షన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మన సౌత్ సినిమాలు అన్ని భాషలతో కలిపి రాబట్టే వసూళ్లను ఈ చిత్రం కేవలం ఒక్క భాష నుండే రాబట్టింది.
ఇకపోతే మొదటి 3 రోజుల్లోనే ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో 73 లక్షల వ్యూస్ వచ్చాయి. కేవలం మన దేశం లోనే కాదు, ఏకంగా 22 దేశాల్లో ఈ చిత్రం టాప్ 1 స్థానం లో కొనసాగుతుంది. అందులో మన శత్రు దేశం పాకిస్థాన్ కూడా ఉంది.మొదటి వారం లో ఈ చిత్రానికి పాకిస్థాన్ నుండి 2 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట. ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో జరిగే రాజకీయాలు, అదే విధంగా అక్కడ టెర్రరిజం ఏ స్థాయిలో పాతుకుపోయింది?, ఇండియా లో వాళ్ళు చేసిన టెర్రరిస్ట్ అటాక్స్ ని కూడా చూపిస్తూ , ప్రతీ భారతీయుడి నెత్తురు మరిగేలాగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు డైరెక్టర్ ఆదిత్య డర్. దీంతో తమ దేశాలకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని మిడిల్ ఈస్ట్ దేశాల్లో బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు.
ఒకవేళ ఈ సినిమా మిడిల్ ఈస్ట్ లో విడుదల అయ్యుంటే ఓవర్సీస్ నుండి 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేదు కాబట్టి, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 50 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ మార్చి 19 న విడుదల కాబోతుంది. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి గొప్ప రెస్పాన్స్ ఏమి రాలేదు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ లో చూపించిన క్లిఫ్ హ్యాంగర్ షాట్స్ ని టీజర్ లో చూపించారు. ఇప్పుడు ఓటీటీ లో ఈ చిత్రం సొంతం చేసుకుంటున్న రెస్పాన్స్ ని చూస్తుంటే, సీక్వెల్ కేవలం మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకునేలా అనిపిస్తోంది.