Dhurandhar 2 vs Ustaad Bhagat Singh: పాన్ ఇండియా లెవెల్ లో మూవీ లవర్స్ అందరూ ఇప్పుడు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie). మన తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డైనోసార్ లాంటి ఈ సినిమాకు ఎవరు పోటీ గా వచ్చినా ఓడిపోతారని , అనవసరంగా ఆ సాహసం చేయొద్దు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు చాలా రోజుల నుండి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న ‘టాక్సిక్ ‘ కూడా భయపడి వాయిదా పడింది. ఇక రీజనల్ సినిమాలు విడుదలకు సాహసం చేస్తాయా అని అనేవారు. ఇలా సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్న సమయంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రాన్ని మార్చి 19 న విడుదల చేయబోతున్నాము అంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
‘ధురంధర్ 2’ లాంటి సినిమాకు ఎదురు వెళ్లడమా ?, అది కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ లాంటి మామూలు రొటీన్ కమర్షియల్ సినిమాతో ?, మేకర్స్ చాలా పెద్ద సాహసమే చేశారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ధురంధర్ 2 ‘ చిత్రానికి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉండొచ్చు , కానీ తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేసరికి ఇక్కడ పవన్ కళ్యాణ్ మేనియా ముందు కొట్టుకొని పోతాది , సరైన టీజర్ , ట్రైలర్ పడాలి అంతే, అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ధైర్యం గా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే , ఎవరికీ నష్టం అనేది ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ‘ధురంధర్ ‘ చిత్రం కేవలం హిందీ వెర్షన్ లో విడుదలై 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Also Read: గ్రాండ్ గా జరిగిన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ వివాహం.. పెళ్లి కూతురు ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!
కాబట్టి ‘ధురంధర్ 2 ‘ కూడా కేవలం హిందీ వెర్షన్ నుండి అంతకు మించిన గ్రాస్ ని రాబట్టగలదు. తెలుగు వెర్షన్ మార్కెట్ ‘ధురంధర్ 2’ కి కేవలం బోనస్ మాత్రమే. కాబట్టి ఆ సినిమాకు వచ్చే నష్టం ఏమి లేదు, ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికే నష్టం. ఎందుకంటే హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి భారీగా మల్టీప్లెక్స్ షోస్ దొరకవు. సోలో విడుదల అయితే అన్ని స్క్రీన్స్ లోనూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రమే ఉండేది. ఉదాహరణకు హైదరాబాద్ లో ఈ సినిమా సోలో గా విడుదల అయ్యుంటే 1400 షోస్ దక్కేవి. కానీ ఇప్పుడు వెయ్యి షోస్ దొరకడం కూడా అనుమానమే. ఒకవేళ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చి , ‘ధురంధర్ 2’ కి హిట్ టాక్ వస్తే మాత్రం, ఆ సినిమా తెలుగు వెర్షన్ వసూళ్లు ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కంటే ఎక్కువ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.