Venkatesh movie damaged image: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడం వెంకటేష్ కి మాత్రమే సాధ్యమవుతుంది… అలాంటి వెంకటేష్ ప్రస్తుతం వైవిధ్య భరితమైన కథాంశాలను సినిమాలుగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గత సంవత్సరం చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సైతం పెను సంచలనాలను క్రియేట్ చేస్తాననే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.
వెంకటేష్ నుంచి వచ్చే సినిమాల్లో కామెడీ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే ఎమోషనల్ సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. దానివల్ల అతను నుంచి వచ్చే సినిమాలు ఫ్లాప్ అయిన కూడా మినిమం కలెక్షన్స్ రాబడతాయనే ఒక నమ్మకం అయితే ప్రొడ్యూసర్లకు ఉంది. అందుకోసమే అతని మీద భారీ బడ్జెట్ పెట్టడానికి సైతం ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు… వెంకటేష్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక అనవసరమైన సినిమా చేసి తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు.
Also Read: బాలయ్య డ్రీమ్ రోల్ అదే…దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పనిచేస్తున్నాడు…
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘సుభాష్ చంద్రబోస్’ సినిమా కావడం విశేషం… సుభాష్ చంద్రబోస్ అనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ యొక్క ఫిక్షనల్ స్టోరీని తీసుకొని ఈ సినిమాను డిజైన్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుందని అందరు అనుకున్నప్పటికి ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో వెంకటేష్ చాలా వరకు డీలా పడిపోయాడనే చెప్పాలి.
ఆ తర్వాత నుంచి అతనికి సరైన సక్సెస్ కూడా దక్కలేదు…తన ఎంటైర్ కెరియర్ లో ఏదైనా బ్యాడ్ ఫిలిం ఉందంటే అది సుభాష్ చంద్రబోస్ మూవీనే అంటూ వెంకటేష్ సైతం పలు సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ ఈ సినిమా చేసి ఉండకపోతే బాగుండదని తన అభిమానులు కూడా భావిస్తుంటారు…
