Dhurandhar 2: వచ్చే నెల 19 వ తేదీన విడుదల అవ్వాల్సిన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం, ఇప్పుడు వాయిదా పడక తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఒక ప్రచారం జరుగుతోంది. అందుకు ముఖ్య కారణం ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడం వల్లే. రీసెంట్ గా ముంబై లో నిషేదిత ప్రాంతం లో షూటింగ్ చేస్తున్నందుకు, ధ్రోన్ కెమెరాలను అనుమతి లేకుండా పరిసర ప్రాంతాల్లో ఎగురవేస్తున్నందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ అయ్యింది. ధురంధర్ టీం పై కేసులు కూడా వేసింది. ఇప్పుడు మరోసారి షూటింగ్ చేసుకోవాల్సిందిగా అనుమతి కోరగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఒప్పుకోలేదు. ముంబై లో అసలు షూటింగ్ చేసుకోవడానికే వీలు లేదని, దీనిపై బ్యాన్ విధించాలంటూ ప్రభుత్వాన్ని కార్పొరేషన్ కోరింది. ఈ కారణం చేత షూటింగ్ పై తీవ్రమైన ప్రభావం పడనుంది.
మూవీ టీం రెండు రోజుల క్రితమే కార్పొరేషన్ కి అనుమతి ని ఇవ్వాలంటూ అప్లికేషన్ పెట్టుకుంది. పని అయిపోతుందిలే అని అనుకుంటే, కార్పొరేషన్ అనుమతి ని నిరాకరించడమే కాకుండా, ఈ సినిమా షూటింగ్ పై శాశ్వత బ్యాన్ విధించాలంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఇటీవల కాలం లోనే ముంబై లోని పలు వీధుల్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగిందని, మూవీ టీం షరతులను ఉల్లగిస్తూ క్రాకర్స్, మండే పదార్దాలను షూటింగ్ లో ఉపయోగించారని అధికారులు చెప్పుకొచ్చారు. మరి ప్రొడక్షన్ టీం ఇప్పుడు ఏమి చేయబోతుందో చూడాలి. మరోపక్క ఈ సినిమా విడుదల తేదికి సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్ ఎప్పుడు పూర్తి అవ్వాలి ?, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్ వర్క్, రీ రికార్డింగ్ వర్క్ వంటివి ఎప్పుడు పూర్తి అవ్వాలి?, ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్చి 19 న రావడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు.
గత ఏడాది డిసెంబర్ 4 న విడుదలైన ‘ధురంధర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా అంటే ఇది రా అని ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. కేవలం హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా విడుదలైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై కేవలం పది రోజుల్లోనే 16 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోనే రన్ అవుతుండడం విశేషం. చూస్తుంటే దేశవ్యాప్తంగా ఈ సినిమా వంద రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకునేలా ఉందంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.