spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 leak online: విడుదలైన రోజే HD క్వాలిటీ తో ఆన్లైన్ లోకి వచ్చేసిన...

Dhurandhar 2 leak online: విడుదలైన రోజే HD క్వాలిటీ తో ఆన్లైన్ లోకి వచ్చేసిన ‘ధురంధర్ 2’..మేకర్స్ కి చావుదెబ్బ!

Dhurandhar 2 leak online: ప్రస్తుతం ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రానికి కూడా పైరసీ ఇక్కట్లు తప్పడం లేదు. మేకర్స్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పైరసీ ని అరికట్టలేకపోతున్నారు. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం పైరసీ కి గురైంది. థియేటర్ ప్రింట్ కూడా కాదు, స్వచ్ఛమైన సౌండ్ క్వాలిటీ తో, HD వీడియో ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చేసింది. చాలా మంది థియేటర్స్ లో టికెట్స్ దొరకని వాళ్ళు , ఇప్పుడు ఆన్లైన్ లోనే చూసేస్తున్నారు. సరిగ్గా ఓపెనింగ్స్ సమయం లో ఇలాంటివి జరగడం సినిమాకు ఏ రేంజ్ నష్టాలను తెచ్చిపెడుతుందో మీరే ఊహించుకోండి. తెలుగు వెర్షన్ ఇంకా విడుదల అవ్వలేదు. విడుదలయ్యాక ఇది ఇంకా స్పష్టమైన క్వాలిటీ తో ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అదే కనుక జరిగితే తెలుగు వెర్షన్ కి కూడా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సినిమా నిడివి నాలుగు గంటలపైనే ఉంటుంది. కాబట్టి అంత సమయం వెచ్చించి థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపని ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ చిత్రానికి తద్వారా భారీ నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. మరి మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడాలి. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది. వచ్చే వారం ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రావాల్సి ఉంది. కేవలం తెలుగు లోనే కాదు, తమిళం మరియు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాలేదు. చివరి నిమిషం లో సెన్సార్ సభ్యులు కొన్ని మార్పులు , చేర్పులు సూచించడం తో మేకర్స్ పనిలో పడడం వల్ల , అనుకున్న సమయానికి ఈ చిత్రం ఇతర భాషల్లో విడుదల కాలేకపోయింది.

Also Read: ‘ధురంధర్ 2’ కి బ్రహ్మరథం పట్టిన టాలీవుడ్ హీరోలు.. పట్టించుకోని బాలీవుడ్ హీరోలు!

ఒక్కసారి విడుదలయ్యాక మాత్రం ఇక్కడ భారీ ఓపెనింగ్స్ అయితే నమోదు అవుతాయి కానీ, పైరసీ ఎంత నష్టం చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 250 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మొదటి భాగం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై నెల రోజులు దాటింది. అయినప్పటికీ ఆ చిత్రం టాప్ 2 స్థానం లో కొనసాగడం విశేషం. అయితే ఓటీటీ టర్మ్స్ ప్రకారం థియేటర్స్ లోకి విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లోకి విడుదల అవ్వాలి. కానీ ఈ చిత్రం మాత్రం థియేటర్స్ లో విడుదలైన రెండు నెలల తర్వాతనే ఓటీటీ లోకి విడుదల చెయ్యాలి అనే డీలింగ్ పెట్టుకున్నారట.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper