Dhurandhar 2 first day collections: భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూవీ లవర్స్ అందరూ ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు మార్కెట్స్ లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టే ఓపెనింగ్ వసూళ్లు కూడా వచ్చాయి. తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడినప్పటికీ , మన తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాన్ని హిందీ లోనే చూసారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 148 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో వీకెండ్ కి వచ్చే వసూళ్లు, కేవలం మొదటి రోజే రావడం గమనార్హం.
కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ‘ధురంధర్ 1’ చిత్రం మొదటి రోజు కేవలం 28 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీనిని బట్టీ ఈ సీక్వెల్ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా గట్టిగా జరిగాయి. కానీ చివరి నిమిషం లో రద్దు అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది. డొమెస్టిక్ కలెక్షన్స్ గురించి కాసేపు పక్కన పెడితే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సునామీ తరహా వసూళ్లను రాబట్టింది. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 5.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మిడిల్ ఈస్ట్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ ఈ రేంజ్ ఓపెనింగ్ రావడం హిస్టారికల్ అనే చెప్పొచ్చు.
ప్రస్తుతం బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ లో ఒక సినిమాకు టికెట్స్ అమ్ముడుపోవడం అనేది గతం లో ఏ చిత్రానికి కూడా జరగలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఉన్నటువంటి ఊపు చూస్తుంటే క్లోజింగ్ లో ఈ చిత్రం కహితంగా 3000 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకుంటున్నారు. మొదటి వారం లోనే ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కొడుతుందని అంచనా . రేపు రంజాన్ కావడం తో ఈ చిత్రానికి ఇంకా భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
