Dhruv Vikram Marriage Rumors 2026: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో తమిళ సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) ప్రముఖ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తో ప్రేమలో ఉన్నాడని , వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం పై అటు అనుపమ కానీ , ఇటు ధృవ్ విక్రమ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అనుపమ సోషల్ మీడియా లో వచ్చే ఇలాంటి రూమర్స్ పై స్పందిస్తూ ఉంటుంది . కానీ ఆమె ఈ వార్తపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం తో నిజమే అని అనుకుంటున్నారు అభిమానులు. వీళ్లిద్దరు కలిసి గత ఏడాది బైసన్ అనే చిత్రం లో నటించారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వీళ్ళిద్దరూ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియా లోకి రావడం , అవి బాగా వైరల్ అవ్వడం తో వీళ్ళ మధ్య ఎదో జరుగుతోంది అనే ప్రచారానికి ఆజ్యం పడింది. ఎందుకంటే ఆ ఫోటోలలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది మరీ. అంతే కాకుండా ఒకరి పోస్టులపై ఒకరు ఈమధ్య కాలం లో తరచుగా రెస్పాన్స్ ఇచ్చుకుంటున్న విధానం చూస్తుంటే నిజంగానే వీళ్ళ మధ్య ఎదో జరుగుతోంది అనే వార్త మరింత బలపడుతోంది. సాధారణంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు , మళ్లీ అలాంటి కథనాలు రిపీట్ అవ్వకుండా చెక్ పెడుతూ దూరంగా ఉండడం వంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ అలా లేదు. వీళ్లిద్దరు ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నారో అలాగే ఉంటున్నారు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్లిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారని. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే వీళ్లిద్దరి నిశ్చితార్దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయబోతున్నారట.
ఇక ధృవ్ విక్రమ్ కెరీర్ విషయానికి వస్తే, ఈయన గత చిత్రం బైసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కానీ స్టార్ హీరో అవ్వడానికి ఇలాంటి హిట్స్ సరిపోవు. ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేయాలి. కానీ అలాంటి సినిమాలు ధృవ్ విక్రమ్ కి ఇప్పటి వరకు పడలేదు. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నాడు. కమర్షియల్ గా కూడా వరుస సూపర్ హిట్ ని మైంటైన్ చేస్తూ పోతే , తండ్రిని మించిన తనయుడు అవుతాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే, ఈమె నటించిన చివరి తెలుగు చిత్రం ‘కిష్కిందపురి’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అంతకు ముందు ఈమె నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించిన ‘టిల్లు స్క్వేర్’ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
