Dhoom Dhaam Review: బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు అయితే సాగుతున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి… అయితే గత కొన్ని రోజుల నుంచి బాలివుడ్ సరైన సక్సెస్ అయితే రావడం లేదు…ఇక ఇలాంటి క్రమంలోనే యామీ గౌతమ్ ప్రతిక్ గాంధీ లీడ్ రోల్స్ లో చేసిన ‘ధూమ్ ధామ్’ సినిమా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉంది ఆకట్టుకుంటుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే యామీ గౌతమ్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఇక వాళ్ల శోభనం రోజు ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది. దాంతో వాళ్లను కొంతమంది రౌడీలు వెంబడిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వీళ్ళని వెంబడిస్తున్నారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారా అసలు ఆ రౌడీలకి వీళ్లకు సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రిషబ్ సేథ్ చాలా మంచి కథ తో ఈ సినిమాను తెరకెక్కించాడు…మొదటి నుంచి చివరి వరకు కామెడీగానే ముందుకు సాగుతుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ఐడెంటిటి వచ్చేలా క్యారెక్టరైజేశన్స్ ను క్రియేట్ చేశాడు…ఇక హీరో హీరోయిన్స్ ను వాడుకున్న తీరు కూడా బాగుంది. సిచువేశనల్ కామెడీ తో సినిమా చూసేవారికి సైతం ఎక్కడ బోర్ లేకుండా ముందుకు తీసుకెళ్ళారు…ఇక సెకండ్ హఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు… యామీ గౌతమ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆమె చేసిన ప్రతి సీన్ బాగుంది.కొన్ని సీన్స్ లో అయితే నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చారు…ఇక ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ కూడా బాగా పేలుతుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా నటించి మెప్పించారు…ఇక యామీ గౌతమ్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది…ఆమె చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…తెలుగులో నితిన్ తో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా లో హీరోయిన్ గా నటించింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడం తో ఆమెకి ఆశించిన గుర్తింపైతే రాలేదు…దాంతో ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది…ఇక మొత్తానికైతే ఆమెకి ఈ సినిమా ద్వారా ఒక మంచి క్యారెక్టర్ అయితే దొరికింది…ఇక ప్రతిక్ గాంధీ సైతం మంచి పాత్రతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు…అలాగే పవిత్ర సర్కార్ కూడా తమ నటన ప్రతిభను చూపించే ఒక పాత్ర దొరకడంతో చాలా బాగా నటించి మెప్పించారు…ఇక మిగిలిన పాత్రల్లో కనిపించిన ప్రతి నటులు వాళ్ల పట్ల పరిది మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తె మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికీ కామెడీ సీన్స్ కి ఎమోషనల్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు…ఇక విజువల్స్ కూడా ఈ సినిమా చాలా బాగా ప్లాస్ అయ్యాయి…ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా పెట్టారు…అందుకే సినిమా చాలా రిచ్ గా వచ్చింది…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
కామెడీ సీన్స్
యామి గౌతమ్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి…
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5
