Orange : రామ్ చరణ్(Ram Charan) కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘ఆరెంజ్'(Orange Movie Re Release). ‘మగధీర’ లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసిన ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. ఆ అంచనాలకు అనుగుణంగా పాటలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, కచ్చితంగా రామ్ చరణ్ కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్ అవ్వుద్ది అనుకున్నారు. కానీ విడుదల తర్వాత మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. మగధీర తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఓపెనింగ్స్ అదరగొట్టినా, లాంగ్ రన్ లో పడిపోయింది. అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం అర్థం అవ్వాలి అనుకోవడం అత్యాశే. స్క్రీన్ ప్లే అంత కంప్లెక్స్ గా ఉంటుంది. కానీ జెనరేషన్స్ మారిపోవడంతో ఈ సినిమాకి ఇప్పుడు మామూలు క్రేజ్ ఏర్పడలేదు.
రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ ని చేసేసారు. గత ఏడాది ఈ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయగా, బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్ లో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక ఫ్లాప్ సినిమాకి ఇంతటి రెస్పాన్స్ ఎలా వచ్చింది అని అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు థియేటర్స్ లో ఆడియన్స్ చేసుకున్న సంబరాలు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో సంచలనం రేపాయి. ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని మరో రీ రిలీజ్ చేశారు. మొదటి రీ రిలీజ్ లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో, అదే తారగా రెస్పాన్స్ రెండవసారి రీ రిలీజ్ అయినప్పుడు కూడా రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. చాలా లిమిటెడ్ షోస్ తోనే నిన్న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు.
ఆ లిమిటెడ్ షోస్ ద్వారానే ఈ సినిమాకి దాదాపుగా 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు(Day1 Collections) వచ్చాయి. షోస్ ఫుల్ అవ్వడం, వెంటనే కొత్త షోస్ యాడ్ చేయడం, నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు బుక్ మై షో లో జరిగింది ఇదే. మంచి డిమాండ్ ఉండడంతో వారం రోజుల వరకు షోస్ ని షెడ్యూల్ చేసారు. నేడు కూడా హైదరాబాద్ లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అత్యధిక షోస్ లేకపోయినా కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అంతే కాదు నిన్న ఈ చిత్రం తో పాటు, రెండు కోట్ల సినిమాలు కూడా విడుదల అయ్యాయి. వాటిని పూర్తిగా డామినేట్ చేయడమే కాదు, ఆ సినిమాలను థియేటర్స్ నుండి తీసేసి ఆరెంజ్ చిత్రాన్ని వేస్తున్నారు. చూస్తుంటే రెండవ రీ రిలీజ్ ఫుల్ రన్ ముగిసే సమయానికి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.