https://oktelugu.com/

Puri Jagannadh : హిట్స్ కొడితేనే మహేష్ మూవీ చేస్తాడు.. పూరి జగన్నాథ్ సంచలన కామెంట్స్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. కెరీర్ లో ఎన్నడూ చూడని డిజాస్టర్లు పూరి జగన్నాథ్ కి ఎదురవుతున్నాయి.

Written By: , Updated On : February 15, 2025 / 02:14 PM IST
Puri Jagannadh

Puri Jagannadh

Follow us on

Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. కెరీర్ లో ఎన్నడూ చూడని డిజాస్టర్లు పూరి జగన్నాథ్ కి ఎదురవుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తీసిన లైగర్ డిజాస్టర్ కాగా.. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఒకప్పుడు హీరోలను స్టార్లను చేసిన డైరెక్టర్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో పూరి జగన్నాథ్ తాను ఎంచుకుంటున్న కథలని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పూరి జగన్నాథ్ తన కెరీర్ లో రవితేజ, పవన్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చి స్టార్ హీరోలను చేశారు. పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో భారీ వసూళ్లు ఎలా ఉంటాయో తొలి సారి రుచి చూపించారు. పైగా పూరి జగన్నాథ్ సినిమా మేకింగ్ కి పెద్దగా టైం కూడా తీసుకోరు. చకచకా సినిమాలు పూర్తి చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

అలాంటి పూరి జగన్నాథ్ తిరిగి సాలిడ్ గా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ బాబు కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. 28 ఏప్రిల్ 2006న ఈ మూవీ రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా రికార్డులను నెలకొల్పింది. రూ. 10 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో రూ. 70 కోట్ల గ్రాస్.. రూ. 40 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా రిలీజై దాదాపు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీలో మహేష్ సరసన ఇలియానా నటించింది. అలాగే షాయాజీ షిండే, ఆశీష్ విధ్యార్థి, బ్రహ్మానందం, అలీ పలువురు కీలక పాత్రల్లో నటించారు. అయితే నిజానికి ఈ సినిమా కథను పూరి మహేష్ బాబు కోసం రాసుకోలేదంట. పోకిరి సినిమా 2006లో రిలీజ్ కాగా.. ఆ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్లకు ముందుగానేనంట.

పూరి తన తొలి చిత్రం బద్రి కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ సినిమా కోసం హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను తీసుకోవాలని అనుకున్నాడట. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్స్ అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా తెరమీదకు రాలేదు. ఆ తర్వాత మహేష్ కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారట. ఈ క్రమంలోనే పూరీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో మహేశ్ బాబు నైజం ఏంటో పూరీ బయటపెట్టారు. మహేశ్ తోని సినిమా చేస్తున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. మహేశ్ హిట్లలో ఉన్న డైరెక్టర్లతోనే చేస్తాడు. మిగతా వాళ్లతో చేయరని చెప్పుకొచ్చాడు. కొంత కాలంగా హిట్స్ కు దూరంగా ఉన్న తనతో అసలు చేయడని చెప్పుకొచ్చాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే చేస్తారా అని యాంకర్ అడిగితే నేను మహేశ్ తో చేయనంటూ కుండబద్ధలు కొట్టారు.

బాలయ్యతో పూరి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరి, బాలయ్య కాంబినేషన్ లో గతంలో పైసా వసూల్ చిత్రం వచ్చింది. అది బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య యాటిట్యూడ్ మాస్ ఆడియన్స్ ని అలరించింది. పూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఫ్లాపుల్లో ఉన్నా సరే నేను వెళ్లి అడిగితే వెంటనే డేట్లు ఇచ్చి సినిమా చేసే ఏకైక హీరో బాలయ్య అని పూరి జగన్నాథ్ తెలిపారు. బాలయ్య క్యారెక్టర్ అలాంటిది. ఆయన హిట్లు ఫ్లాపులు పట్టించుకోరు. మనుషులకు విలువ ఇచ్చే వ్యక్తిత్వం బాలయ్యది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్యతో సినిమా చేయాలని కోరుతున్నారు.

Director Puri Jagannadh about Mahesh Babu 🥵 #purijagannadh #maheshbabu #viralvideo #shorts