Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తుంది. ముఖ్యంగా తెలుగు హీరోలు వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కను అందుకోవడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను కూడా కొల్లగొడుతూ ముందుకు సాగడం అనేది ఒక శుభసూచకం అనే చెప్పాలి… ఇక మీదట కూడా మన స్టార్ హీరోలు వాళ్ల సినిమాలతో ఇండస్ట్రీ రికార్డు లను కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతం చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమా రన్ టైమ్ విషయంలో చాలా వరకు అనుమానాలు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. నిజానికి 3 గంటల 15 నిమిషాలు అంటే చాలా ఎక్కువ టైమ్ మనం అంతసేపు ఈ సినిమాని చూడగలమా? సుకుమార్ ఎంగేజ్ చేయించగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇంతకుముందు రంగస్థలం, అర్జున్ రెడ్డి, అనిమల్ లాంటి సినిమాలు మూడు గంటల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలు అంటే చాలా ఎక్కువ రన్ టైమ్ అనే చెప్పాలి. మరి ఇంత సేపు ప్రేక్షకుడు బోర్ లేకుండా ఈ సినిమాను చూడగలుగుతాడా ఒకవేళ చూసినా ఆ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాడా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద సుకుమార్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తలుచుకుంటే ఈ రన్ టైమ్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఎమోషన్స్ కావాలి, ఎక్కడ ఎలివేషన్ కావాలో తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఈ దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మనం గుండెల మీద చేయి వేసుకొని హాయిగా సినిమాని చూడొచ్చు.
అందుకే సినిమాలో ఉన్న ఏ ఎపిసోడ్ ని కట్ చేయకుండా ప్రేక్షకుడు పుష్ప రాజ్ యొక్క విలయ తాండవాన్ని చూడాలనే ఉద్దేశ్యంతోనే సినిమా రన్ టైమ్ పెరిగిన కూడా అన్ని సీన్స్ ని ఆడ్ చేసి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్కడ కూడా ఎడిటర్ తన కత్తెరకు పని చెప్పాల్సిన అవసరం లేకుండా సినిమా స్క్రీన్ ప్లే ను చాలా టైట్ గా రాసుకున్నారట. మరి ఇలాంటి సందర్భంలోనే సుకుమార్ తన డైరెక్షన్ కు సంబంధించిన దమ్మెంటో చూపించాల్సిన అవసరమైతే ఉంది.
ఒకవేళ ప్రేక్షకులు చిన్నపాటి బోర్ ఫీల్ అయినా కూడా సుకుమార్ డైరెక్టర్ గా ఫెయిల్ అయిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చాలా కాన్ఫిడెంట్ తో సుకుమార్ ఈ సినిమాని దింపుతున్నాడు అంటే ఈ సినిమాలో అంతకుమించి ఎలిమెంట్స్ ఉన్నాయనే చెప్పాలి…