https://oktelugu.com/

Dhee Celebrity Special 2: నిన్ను తొక్కేయకపోతే నా పేరు హైపర్ ఆది కాదు… బిగ్ బాస్ బ్యూటీ మీద పగబట్టిన బుల్లితెర స్టార్, వివాదం ఏమిటీ?

హైపర్ ఆది బుల్లితెర స్టార్ గా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ఈటీవీ పాప్యులర్ షోలలో హైపర్ ఆదిదే హవా. జబర్దస్త్ వేదికగా ఈ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. అదిరే అభి హైపర్ ఆదికి ఛాన్స్ ఇచ్చాడు. తన టీమ్ లో చోటు ఇచ్చాడు. హైపర్ ఆది తన టాలెంట్ తో అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్నాడు. మరొక కమెడియన్ రైజింగ్ రాజుతో కలిసి ఇద్దరూ లీడర్స్ గా కొత్త టీమ్ ఏర్పాటు చేశారు. హైపర్ ఆది టీమ్ జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 14, 2024 / 08:31 AM IST

    Dhee Celebrity Special 2

    Follow us on

    Dhee Celebrity Special 2: బుల్లితెరపై రాణిస్తున్న బిగ్ బాస్ బ్యూటీకి హైపర్ ఆది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను తొక్కేయకపోతే నా పేరు హైపర్ ఆదీనే కాదు. ఇది గుర్తు పెట్టుకో… అని ఓపెన్ గా ఆమెకు అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడు. హైపర్ ఆది అంతగా బిగ్ బాస్ బ్యూటీని టార్గెట్ చేయడానికి కారణం ఏమిటీ? ఇంతకీ ఆమె ఎవరో చూద్దాం

    హైపర్ ఆది బుల్లితెర స్టార్ గా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా ఈటీవీ పాప్యులర్ షోలలో హైపర్ ఆదిదే హవా. జబర్దస్త్ వేదికగా ఈ కమెడియన్ వెలుగులోకి వచ్చాడు. అదిరే అభి హైపర్ ఆదికి ఛాన్స్ ఇచ్చాడు. తన టీమ్ లో చోటు ఇచ్చాడు. హైపర్ ఆది తన టాలెంట్ తో అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్నాడు. మరొక కమెడియన్ రైజింగ్ రాజుతో కలిసి ఇద్దరూ లీడర్స్ గా కొత్త టీమ్ ఏర్పాటు చేశారు. హైపర్ ఆది టీమ్ జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    Also Read: భారీ రేటు కు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటిటి రైట్స్…ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా…

    ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ అదరగొడుతుంటే… జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ సత్తా చాటేది. హైపర్ ఆది కామెడీ పంచెస్ పవర్ ఢీ షోకి పాకింది. మల్లెమాల సంస్థ సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలను ఢీ షోలో కూడా పెర్ఫార్మ్ చేయాలని కోరింది. అక్కడ కూడా హైపర్ ఆది సక్సెస్ అయ్యాడు. ఢీ టీఆర్పీ పెరగడంలో దోహదం చేశాడు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం ఢీ షోలో లేరు. హైపర్ ఆది ఒంటి చేత్తో ఢీ ని నడిపిస్తున్నాడు.

    జబర్దస్త్ కి హైపర్ ఆది గుడ్ బై చెప్పి చాలా కాలం అవుతుంది. మల్లెమాల సంస్థ నిర్మిస్తున్న ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆది కొనసాగుతున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్ గా రాణిస్తున్నాడు. హైపర్ ఆదికి ఉన్న డిమాండ్ రీత్యా.. బుల్లితెర షోలలో డామినేషన్ హైపర్ ఆదిదే. ఇతరుల మీద ఆయన పంచులు విసురుతాడు. హైపర్ ఆది పంచులకు ఒక్కోసారి జడ్జెస్ కూడా బలి అవుతారు. కానీ ఏమీ అనలేరు.

    వివాదం తలెత్తితే అవతలి వాళ్ళను సంస్థ తొలగిస్తుంది కానీ… హైపర్ ఆదిని వదులుకోదు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి హైపర్ ఆది పంచెస్ శృతి మించుతూ ఉంటాయి. తాజా ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్యకు అందరి ముందే వార్నింగ్ ఇచ్చాడు హైపర్ ఆది. శ్రీసత్య.. నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు హైపర్ ఆది కాదు. గుర్తు పెట్టుకో అన్నాడు. అంత సీరియస్ గా శ్రీసత్యకు హైపర్ ఆది ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అనే చర్చ మొదలైంది.

    ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రోమో లో హైపర్ ఆది శ్రీసత్యకు వార్నింగ్ ఇవ్వడం మనం చూడొచ్చు. మరి శ్రీసత్యకు అంత స్ట్రాంగ్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటో పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. శ్రీసత్య బిగ్ బాస్ తెలుగు 6లో పాల్గొంది. ఆమె ఫైనల్ వీక్ వెళ్ళింది. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో టైటిల్ రేసు తప్పుకుంది. శ్రీసత్య హౌస్లో తన ప్రవర్తనతో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. ఆమె నెగిటివ్ ఇమేజ్ తో బయటకు వచ్చింది. ప్రస్తుతం బుల్లితెర షోల్లో సందడి చేస్తుంది.

    Also Read: భారతీయుడు 3 ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందిగా…ఈ సినిమా తో శంకర్ ఊచకోత మొదలు పెట్టబోతున్నాడా..?