Dhee 20 : ఈటీవీ ఛానల్ లో ఎన్నో ఏళ్ళ నుండి ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒకటి ‘ఢీ’. 2009 వ సంవత్సరం లో ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ షో మొదలైంది. అప్పటి నుండి 2026 వరకు విరామం లేకుండా 20 సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఈ డ్యాన్స్ షో. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ ఇండస్ట్రీ కి పరిచయమై , నేడు దేశంలోనే స్టార్ కొరియోగ్రాఫర్స్ గా చలామణి అవుతున్నారు. వారిలో జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. వీళ్లిద్దరి కెరీర్ ఈ షో తోనే మొదలైంది. కొరియోగ్రాఫర్స్ గా ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు , కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై , మంచి ఫేమ్ ని సంపాదించుకున్న తర్వాత సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నారు.
ఆ తర్వాత వీళ్లిద్దరు అంచలంచలుగా ఎదుగుతూ ఏ స్థాయికి చేరుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రఘు మాస్టర్, గణేష్ మాస్టర్, విజయ్ బెన్ని మాస్టర్ , ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించింది ఈ డ్యాన్స్ షో. నేడు వీళ్లంతా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో కి ఇక శుభం కార్డు పడింది. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న ‘ఢీ 20’ షో , ఈ బుధ , గురువారాల్లో జరిగే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే , ఇది చాలా పెద్ద సీజన్ అనే చెప్పాలి. మంచి టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఈ సీజన్ కి నమోదు అయ్యాయి. అయితే కొంచెం గ్యాప్ ఇవ్వబోతున్నాము అని ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నందు చెప్తున్నారు కానీ, శాశ్వతంగా ఈ షోకి శుభం కార్డు పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం టీఆర్ఫీ రేటింగ్స్ పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ టీఆర్ఫీ రేటింగ్స్ ఆధారంగానే యాడ్స్ వస్తుంటాయి. భారీ రేటింగ్స్ వచ్చే షోస్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ , ఇలాంటి 3 లోపు రేటింగ్స్ వచ్చే షోస్ కి చాలా ఇబ్బంది. అందుకే ‘ఢీ’ షోని నిలిపివేసినట్టు సమచారం. భవిష్యత్తులో ఇలా తక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే షోస్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అంటే జబర్దస్త్ కూడా త్వరలోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఢీ డ్యాన్స్ షోని ఇష్టపడే వాళ్లకు ఇదే చివరి ఛాన్స్ , ఈ బుధ , గురువారాల్లో ప్రసారమయ్యే ఫినాలే ఎపిసోడ్స్ ని వీక్షించి టాటా చెప్పేయండి. ఇప్పటి వరకు అన్ని సీజన్స్ కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వారంతా ఈ ఫినాలే ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.
