Homeఎంటర్టైన్మెంట్Dhee Show: ఢీ-13 టైటిల్‌ విజేత ఎవరంటే... స్పెషల్ గెస్ట్ గా అల్లు అర్జున్

Dhee Show: ఢీ-13 టైటిల్‌ విజేత ఎవరంటే… స్పెషల్ గెస్ట్ గా అల్లు అర్జున్

Dhee Show: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’. ఈటీవీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో 13వ సీజన్‌ బుధవారంతో పూర్తైంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా సుధీర్‌-ఆది, రష్మి-దీపిక టీమ్‌ లీడర్లుగా ఈ షో కి వ్యవహరిస్తున్నారు. కాగా అందాల భామ ప్రియమణి, గణేశ్ మాస్టర్‌‌, పూర్ణ న్యాయ నిర్ణేతలుగా చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి ప్రేక్షకులకు చేరువైన ఈ షో గ్రాండ్‌ ఫినాలే ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా జరిగిన ఈ తుదిపోరులో క్వీన్స్‌ టీమ్‌ నుంచి కావ్య, కింగ్స్‌ టీమ్‌ నుంచి కార్తిక్‌ హోరాహోరీగా తలపడ్డారు. వీరి మధ్య జరిగిన డ్యాన్స్‌ వార్‌ చూసి బన్నీ సైతం ఆశ్చర్యపోయారు.

Dhee Show
Dhee Show

Also Read: సినిమా క్యారెక్టర్లతో అదరగొట్టిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు

తుదిపోరులో భాగంగా కావ్య – కార్తిక్‌ మధ్య… ఫోక్‌, హిప్‌పాప్‌, ప్రొపర్టీ, టైరో, సాల్సా, విభాగాల్లో పోరు జరిగింది. చివరికి షూట్‌ అవుట్‌ రౌండ్ లో కూడా ఇద్దరు కంటస్టెంట్ లు తమదైన శైలిలో దుమ్ముదులిపారు.  కావ్య తన డ్యాన్స్‌తో అందర్నీ ఫిదా చేసింది. ప్రతి రౌండ్‌లో ఆమె చేసిన మూమెంట్స్‌,  ఎక్స్‌ప్రెషన్స్‌కి న్యాయ నిర్ణేతలు, ఢీ టీమ్‌తో పాటు బన్నీ కూడా వావ్‌ అంటూ కితాబిచ్చారు. కార్తీక్ కూడా తన డాన్స్ లతో అందర్నీ ఆకట్టుకున్నాడు.  అనంతరం అన్నిరౌండ్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కావ్యకు ‘ఢీ-13’ టైటిల్‌ ను  అందజేశారు. మరోవైపు, ‘ఢీ’ తదుపరి సీజన్‌ని ప్రకటించి దాని టైటిల్‌ని బన్నీతో లాంచ్‌ చేయించడం జరిగింది.  ‘ఢీ’ 13 తదుపరి సీజన్‌  గా ‘ఢీ ది డ్యాన్స్‌ ఐకాన్‌’ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Kavya & Karthik Shoot Out Performance | Dhee 13 | Kings vs Queens| Grand Finale | 8th December 2021

Also Read: ముంబయిలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​ కోసమే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version