https://oktelugu.com/

RRR Movie: ముంబయిలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​ కోసమే

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్​.. అందరికీ రోమాలు నిక్కబొడిచేలా చేసింది. యాక్షన్​, ఎమోషన్​, ఫైట్స్​, లుక్​ ఇలా అన్నింటిపరంగా సినిమాపై భారీ అంచనాలు పెంచెసింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 02:27 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్​.. అందరికీ రోమాలు నిక్కబొడిచేలా చేసింది. యాక్షన్​, ఎమోషన్​, ఫైట్స్​, లుక్​ ఇలా అన్నింటిపరంగా సినిమాపై భారీ అంచనాలు పెంచెసింది.

    RRR Movie

    ఇందులో  బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.  ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో దూకుడు పెంచారు మేకర్స్​. ముందుగానే షెడ్యూల్​ చేసినట్లుగా దేశంలోనే 4 ప్రధాన నగరాలైన ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబద్​ల్లో మీడియాతో ప్రెస్​ మీట్​ ఏర్పాట్లు చేసింది ఆర్​ఆర్​ఆర్​ టీమ్​.

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మీద సినీ ప్రముఖుల స్పందన.. రాజమౌళికి ‘టేక్ ఏ బౌ’..

    తాజాగా ఈరోజు తొలుత ముంబయిలో ప్రెస్​మీట్​ను పెట్టి.. ఆతర్వాత హైదరాబాద్​లో మీడియాతో ముచ్చటించనున్నారు. ఈ సినిమాలో భీమ్​గా నటిస్తున్న తారక్​.. ఈ రోజు ఉదయం ఈ స్పెషల్​ ఈవెంట్​ కోసం ముంబయికి వచ్చారు. బ్లాక్​డ్రెస్​లో ఎన్టీఆర్​ స్టైలిష్​గా కనిపించారు. మిగిలిన టీమ్​కూడా త్వరలోనే ముంబయికి చేరుకుని.. ఈవెంట్​కు హాజరుకానున్నారు. ఈ ప్రెస్​ మీట్​ ముగిసిని అనంతరం.. చెన్నై, బెంగళూరులో కూడా పర్యటించనున్నారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?