https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లానాయక్​ రన్​టైమ్ లాక్​.. ​ సుత్తె కొట్టకుండా ఉండేందుకే అలా చేశారంట?

Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతికి  స్టార్​ హీరోలు బరిలోకి దిగనున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఈ పోరులో పాటీపడనున్నాయి. జనవరి 7న ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల కానుండగా.. 13న భీమ్లానాయక్​, 14న రాధేశ్యామ్​ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు భీమ్లానాయక్​గా తన పవర్​ చూపించేందుకు పవన్​కళ్యాణ్​ బరిలోకి దిగుతున్నారు. పాన్​ ఇండియా సినిమాల మధ్య రీమేక్​గా వస్తున్న భీమ్లానాయక్​పై […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 02:10 PM IST
    Follow us on

    Bheemla Nayak: ఈ ఏడాది సంక్రాంతికి  స్టార్​ హీరోలు బరిలోకి దిగనున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఈ పోరులో పాటీపడనున్నాయి. జనవరి 7న ఆర్​ఆర్​ఆర్​ సినిమా విడుదల కానుండగా.. 13న భీమ్లానాయక్​, 14న రాధేశ్యామ్​ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు విడుదలైన ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు భీమ్లానాయక్​గా తన పవర్​ చూపించేందుకు పవన్​కళ్యాణ్​ బరిలోకి దిగుతున్నారు.

    bheemla nayak movie team release new poster about release date

    పాన్​ ఇండియా సినిమాల మధ్య రీమేక్​గా వస్తున్న భీమ్లానాయక్​పై దర్శకనిర్మాతలు ఎందుకంత ధైర్యంగా ఉన్నారనేది అందరికీ ఎదురైన ప్రశ్న. పవన్​- రానాల మధ్య జరిగే కీలక సన్నివేశాలే సినిమాకు ప్రేక్షకులను రప్పంచేలా చేస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, మధ్యలో ఈ సినిమా విడుదల విషయంపై అనేక వార్తలు వినిపించినప్పటికీ.. ఎట్టకేలకు సంక్రాంతికి రావడం ఖాయమని తేలింది.

    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మీద సినీ ప్రముఖుల స్పందన.. రాజమౌళికి ‘టేక్ ఏ బౌ’..
    ఈ క్రమంలోనే పోస్ట్​ ప్రొడక్షన్​ పనులతో పాటు, సినిమా ప్రమోషన్స్​కూడా వేగవంతం చేస్తున్నారు మేకర్స్​. తాజాగా, ఈ సినమా రన్​టైమ్​పై ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సినిమా నిడివిని లాక్​చేసినట్లు తెలుస్తోంది. కంటెంట్​ ఉన్న సినిమా కావడంతో.. ఇందులో స్పెషల్​ సాంగ్స్​, ఇంట్రడక్షన్​ సాంగ్స్, అనవరసరమైన సీన్స్​ లేకపోవడం వల్ల.. ఈ సినమా రన్​టైమ్​ 2గంటల 20 నిమిషాలకు లాక్​ చేసినట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల జనాలకు బోర్​ కొట్టకుండా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట.

    సాగర్​ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్​ మాటలు, స్క్రీన్​ ప్లే అందిస్తున్నారు. థమన్​ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

    Also Read: మంచు విష్ణు కొత్త ఛాలెంజ్​.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​