Dhanush Kara Movie Twitter Review: విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వగల సౌత్ ఇండియన్ హీరోల్లో ఒకరు ధనుష్(Dhanush K Raja). ఈయనకు కేవలం తమిళం లోనే కాదు , తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయన మన తెలుగు డైరెక్టర్స్ తో చేసిన ‘సార్ ‘, ‘కుబేర’ చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చాయో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర'(Kara Movie) నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి వివరంగా చూద్దాం. ట్విట్టర్ లో అయితే ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధనుష్ మరోసారి అద్భుతమైన నటన కనబర్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అంతలా ఈ సినిమాలో ఏముందో ఈ విశ్లేషణలో చూద్దాం.
కథ విషయానికి వస్తే ఇది 1991 వ కాలంలో గల్ఫ్ దేశాల్లో జరిగిన యుద్ధం నేపథ్యం లో తెరకెక్కింది. ఇరాన్ దేశం ఇతర దేశాల ఆయిల్ రీ సోర్స్ పై దాడులు చేయడం, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాలు ‘కరస్వామి’ అనే దొంగ ని జీవితం పై ఎలాంటి ప్రభావం చూపించింది? అనేది స్టోరీ. ఈ చిత్రం లో ధనుష్ నటన చాలా అద్భుతంగా, సహజం గా ఉందని , ఆయనకు జోడీగా నటించిన మమిత బైజు కూడా అదరగొట్టేసిందని, ఆమెలో ఇంత యాక్టింగ్ ఉంటుందని అనుకోలేఅంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతూ, ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ పడుతుందని, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది అంటున్నారు.
ఇక సెకండ్ హాఫ్ కూడా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో డైరెక్టర్ విగ్నేష్ రాజా ఆడియన్స్ ని కట్టిపారేశాడని, ముఖ్యంగా పోలీస్ మరియు బగ్లర్ చేసింగ్ ఎపిసోడ్ సినిమాకే పెద్ద హైలైట్ అని అంటున్నారు. సినిమాలో ఎన్ని థ్రిల్లింగ్ అనుభూతి ని ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయో , సెంటిమెంట్ సన్నివేశాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయని, ప్రతీ సన్నివేశం రియలిస్టిక్ గా ఉండడమే ఈ సినిమాలోని గొప్పతనం అంటూ ట్విట్టర్ లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడు లో ఈమధ్య కాలంలో ఒక పెద్ద హీరో సినిమాకు ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం జరగలేదు. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా తమిళ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త ఊపు ని అందిస్తుందని , అన్నీ కలిసొస్తే ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.
#Kara 1st Half : Fantastic first half!
An emotional slow burn heist thriller..@dhanushkraja at his acting best #KSRavikumar best acting..@gvprakash fab work..
Starts with a bang.. 1st Half ends with a thrilling episode..
Both content + Mass!
A thrilling 2nd half…
— Ramesh Bala (@rameshlaus) April 30, 2026
#Kara Interval: Rooted and realistic thriller from Vignesh Raja that starts off on a very good note, moves into an emotional space and then fires up for a superb interval block. The film takes up the heist angle as a core element and rations it with the intent of the lead… pic.twitter.com/y85lig2ddK
— Siddarth Srinivas (@sidhuwrites) April 30, 2026
Neat second half. Last 30 mins superb stuff
Film never deviates from the core premise and there are no filler scenes or unwanted portions. Vignesh Raja
Liked it pretty much. Heist thriller executed well. #Dhanush #Kara https://t.co/9af6oMQlHI
— Pradeep Gunuganti (@gpradeep123) April 30, 2026