Homeఎంటర్టైన్మెంట్Rakasa Biker OTT release where to watch: నేడే ఓటీటీ లోకి రానున్న 'రాకాస',...

Rakasa Biker OTT release where to watch: నేడే ఓటీటీ లోకి రానున్న ‘రాకాస’, ‘బైకర్’ చిత్రాలు.. ఎందులో చూడాలంటే..

Rakasa Biker OTT release where to watch: ఏప్రిల్ మొదటి వారంలో ఒకే రోజున విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘రాకాస’ , ‘బైకర్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి పెర్ఫార్మన్స్ ని అందుకున్నాయి మనమంతా చూశాము . ‘బైకర్’ తరహా సినిమాలు పెద్దగా ఆడవు అనేది విశ్లేషకులు మొదటి నుండి చెప్పే మాట. భారీ హైప్ ఉంటే ఆడొచ్చేమో కానీ, హైప్ లేకపోతే ఎంత మంచి పాజిటివ్ టాక్ వచ్చినా డిజాస్టర్ గానే మిగులుతుందని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశ్లేషకులు. ‘బైకర్’ విషయంలో అదే జరిగింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల రూపాయలకు జరగడం తో 50 శాతం రీకవరీ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది ఈ చిత్రం.

అంటే కేవలం 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది అన్నమాట. ఇక ‘రాకాస’ విషయానికి వస్తే , ఇందులో ‘మ్యాడ్’ సిరీస్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరో కావడంతో , మొదటి నుండి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టు , ఆ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల ప్రొమోషన్స్ ని కూడా ఇరగ కుమ్మేసింది. దీంతో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది , ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా లిమిటెడ్ గా చేశారు. 13.5 కోట్ల రూపాయలకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే కోటిన్నర లాభం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు చిత్రాలను నేడు ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాల డిజిటల్ రైట్స్ ని మంచి ఫ్యాన్సీ రేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.

నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో డీల్ ప్రకారం ఈ రెండు చిత్రాలను నేడు అర్థ రాత్రి నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో మిస్ అయిన అభిమానులు నెట్ ఫ్లిక్స్ లో ఈ రెండు చిత్రాలను చూసేందుకు సిద్ధంగా ఉండండి. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. అయితే ఓటీటీ లో ‘రాకాస ‘ చిత్రం కంటే ‘బైకర్’ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను ఓటీటీ ఆడియన్స్ ఎగబడి చూస్తారట. గతం లో అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఓటీటీ లో ఈ రెండు చిత్రాల్లో ఏది పైచెయ్యి సాధిస్తుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper