Kara Movie 2 Days Collection: ఏంటో..ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మోస్తరు టాక్ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోతున్నాయి. చిన్న హీరోల సినిమాలకు అలా జరగడంలో వింతేమీ లేదు. ఆడియన్స్ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనే మోడ్ లో ఉంటారు , కానీ ధనుష్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ మీద వసూళ్లు రావడం లేదంటే , ఇంతకంటే డ్రై పీరియడ్ మరొకటి ఉండదేమో అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ధనుష్ హీరో గా తెరకెక్కిన ‘కర’ చిత్రం విడుదలైంది. విగ్నేష్ రాజా దర్శకత్వం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆ టాక్ కి తగ్గట్టుగా లేకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు , తమిళనాడు లో కూడా ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే వసూళ్లు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి రెండు రోజుల్లో 1 కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 1 కోటి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి రెండు రోజుల్లో 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక ప్రాంతం నుండి 1 కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, కేరళ ప్రాంతం నుండి 25 లక్షల రూపాయిలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది . ఇక ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా రెండు రోజుల్లో 5 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు కాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రెండు రోజుల్లో 20 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 9 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది . ధనుష్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అంటే లాంగ్ రన్ చాలా గొప్పగా ఉండాలి , ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని బట్టి చూస్తే లాంగ్ రన్ కష్టమే అని చెప్పొచ్చు.