Homeబిజినెస్Moto G47 Launch: 1080 కెమెరా.. సూపర్ బ్యాటరీతో Moto G47 రిలీజ్.. ధర ఎంతంటే..

Moto G47 Launch: 1080 కెమెరా.. సూపర్ బ్యాటరీతో Moto G47 రిలీజ్.. ధర ఎంతంటే..

Moto G47 Launch: Motorola నుంచి మోటో G47 5G అనే కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. (ఏప్రిల్ 29, 2026) సెలెక్ట్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. మిడ్-రేంజ్ G సిరీస్‌లో 108MP కెమెరా, మంచి బ్యాటరీ ఉన్న ఈ మొబైల్ ధర ఎంతో తెలుసుకుందాం..

Moto G47ను మోటోరోలా కంపెనీ ఏప్రిల్ 29, 2026న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్యాంటోన్ ఫ్యూషియా రెడ్, ఇంపెనెట్రబుల్, నాటికల్ బ్లూ కలర్ల అనే కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. IP64 రేటింగ్ తో దుమ్ము, నీటి నుంచి ఇది రక్షించబడుతుంది. ఈ మొబైల్ లో 6.67 అంగుళాల LCD టచ్‌స్క్రీన్ ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో HD+ రిజల్యూషన్ అందిస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 , ఆక్టా-కోర్ ప్రాసెసర్ పవర్ అందించే ఇది 8GB ర్యామ్ తో పాటు 128GB UFS స్టోరేజ్ (1TB వరకు microSD ఎక్స్‌పాండబుల్) వరకు సపోర్టు చేయనుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఈ మొబైల్ లో ట్రిపుల్ రియర్ సెటప్ చేశారు. 108MP ప్రైమరీ కెమెరా ఉండగా.. 2MP సెన్సార్ తో పనిచేస్తుంది. 1080 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో రికార్డింగ్ కోసం పనిచేస్తుంది. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. అలాగే ఇందులో అదనంగా డాల్బీ ఆట్మాస్ స్టెరియో స్పీకర్లు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయి.

ఈ కొత్త మొబైల్ లో 5200mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీకి 20 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇందులో అదనంగా USB C పోర్ట్, డ్యూయల్ SIM , Wi-Fi 5, బ్లూటూత్ 5.4, NFC, GPS, FM రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. యూరప్‌లో €319 ( భారత కరెన్సీ ప్రకారం.. రూ.28,000 నుంచి రూ. 35,000) ఉంది. అయితే భారత్‌లోకి వస్తే 8GB+128GB వేరియంట్ రూ. 14,999 నుంచి 15,999 రేంజ్‌ తో విక్రయించే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా మొబైల్ కొనాలని అనుకునేవారితో పాటు రోజూవారీ వినియోగదారులకు ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version