https://oktelugu.com/

Dhanush-Aishwarya: విడాకుల అనంతరం తొలిసారి కలిసిన ధనుష్‌- ఐశ్వర్య.. ఫోటో వైరల్.. సర్ ప్రైజ్ లో ఫ్యాన్స్ !

Dhanush-Aishwarya: తమిళ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఇక వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఐతే, చాలా నెలలు తర్వాత, పైగా విడాకుల అనంతరం తొలిసారి ధనుష్‌- ఐశ్వర్య కలిశారు. తమ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ధనుష్‌- ఐశ్వర్య విడివిడిగా వెళ్ళారు. ఈ మాజీ దంపతులిద్దరి మధ్య పెద్దగా మాటలు అయితే లేవు. కానీ కొడుకు కోసం […]

Written By:
  • Shiva
  • , Updated On : August 23, 2022 / 04:48 PM IST
    Follow us on

    Dhanush-Aishwarya: తమిళ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోయి నెలలు గడుస్తున్నాయి. ఇక వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఐతే, చాలా నెలలు తర్వాత, పైగా విడాకుల అనంతరం తొలిసారి ధనుష్‌- ఐశ్వర్య కలిశారు. తమ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ధనుష్‌- ఐశ్వర్య విడివిడిగా వెళ్ళారు. ఈ మాజీ దంపతులిద్దరి మధ్య పెద్దగా మాటలు అయితే లేవు. కానీ కొడుకు కోసం ఇద్దరు ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు. పైగా ఈ మీటింగ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం విశేషం. ‘ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..’ అంటూ సోమవారం ఓ ఫొటో వదిలింది ఐశ్వర్య. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    Dhanush-Aishwarya

    ఐశ్వర్య ఈ ఫోటోతో పాటు ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక తమలో తమకు ఎన్ని గొడవలు ఉన్నా… ధనుష్‌, ఐశ్వర్య మాత్రం తమ పిల్లల కోసం వారితో కలిసి కెమెరావైపు నవ్వులు చిందించారు. వీరి ఫ్యామిలీ ఫోటో కూడా ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా, ఏంటి? అని ట్వీట్లు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే, రజినీకాంత్ కూడా వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడ్డాడు. కనీసం రజిని బాధను చూడలేక అయినా.. ధనుష్‌, ఐశ్వర్య దంపతులు మళ్లీ కలిసిపోతారని ఇన్నాళ్లు అందరూ భావించారు.

    Also Read: Sonali Phogat Passed Away: షాకింగ్: బిగ్ బాస్ బ్యూటీ హఠాన్మరణం.. మరణానికి ముందు ఆమె చివరి వీడియో ఇదీ!

    మరి రజనీ కోసమైనా వీరు మళ్ళీ కలుస్తారో లేదో చూడాలి. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఐశ్వర్య డైరెక్ట్ గా చెబుతూ వస్తోందట. నిజానికి రజినీకాంత్ ఇద్దరినీ కలిపేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఐశ్వర్య మాత్రం అసలు కాంప్రమైజ్ కావడం లేదు. ఓ దశలో ధనుష్ సైతం ఐశ్వర్యకి సారీ చెప్పి.. మళ్లీ ఒక్కటి అవుదాం అని రిక్వెస్ట్ చేశాడట. కానీ.. ఐశ్వర్య మాత్రం ఇక తనకు ఆ ఆలోచన లేదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మనది ఇక నుంచి ఎవరి దారి వారిదే అని ధనుష్ మొహం మీదే ఐశ్వర్య చెప్పింది. పైగా ఐశ్వర్య అంతటితో ఆగలేదు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ధనుష్ పేరుని మొత్తంగా తొలగించి షాక్ ఇచ్చింది.

    Dhanush-Aishwarya

    ప్రస్తుతం ఐశ్వర్య ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్స్ లో కూడా ఆమె తన పేరును ఐశ్వర్య రజినీకాంత్ గానే వేసుకుంది. అందుకే, రజినీకాంత్ కూడా ఈ విడాకుల మేటర్ ని వదిలేశాడట. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్‌ 18న వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరి మధ్యలోకి వేరే వ్యక్తులు వచ్చారని.. ధనుష్ వేరే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని అందుకే అప్పటి నుంచి ఆమె ధనుష్ కి దూరంగా ఉంటుందని తెలుస్తోంది.

    Also Read:Pooja Hegde: పాపం పూజ హెగ్డే పరిస్థితి ఇంత దారుణంగా తయారు అయ్యింది ఏంటి! ఆమె పని అయిపోయినట్టేనా?

     

     

    Tags