Devi Movie Child Actor: తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి విపరీతమైన క్రేజీ సొంతం చేసుకున్న వాళ్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోగా మారాడు. ఇతను మరెవరో కాదు దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్. ఇతని పేరు మహేంద్రన్. ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో బాల నటుడిగా మహేంద్రన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతని పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఒకప్పుడు తెలుగులో భారీ విజయం సాధించిన దేవి సినిమా బాల నటుడు అంటే మాత్రం ప్రేక్షకులు ఈజీగా గుర్తుపడతారు. దేవి సినిమాలో మహేంద్రన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు గాను అతను నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేంద్ర తెలుగులో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్ మహేంద్రన్ చదువులపై దృష్టి పెట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.
Also Read: ఉగ్రదాడికి ముందు.. జ్యోతి మల్హోత్రా పహల్గాం పర్యటన.. వెలుగులోకి సంచలన నిజం!
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మహేంద్రన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఇతను హీరోగా కనిపించబోతున్నాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి వసుదేవ సుతం అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు మహేంద్రన్. ఈ సినిమాను రెయిన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేంద్రన్ హీరోగా నటిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా తాజాగా ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ వీడియోలో మీరు జగన్నాథుడి గుడితో పాటు అందులో పాము కూడా చూడవచ్చు. ఈ వీడియోను చూస్తే ఈ సినిమా కథ గుడి చుట్టూ తిరిగే మైథాలజికల్ కథ ఆధారంగా ఉంటుంది అంటూ తెలుస్తుంది. ఈ వీడియోతో సినిమాపై చిత్ర యూనిట్ ప్రేక్షకులలో భారీ క్యూరియాసిటీని కలిగించారు.
మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు ఒరియా భాషలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.మహేంద్రన్ ఒకప్పుడు బాల నటుడిగా దేవి, ఆహా, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హాట్స్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇతను మొత్తం 130 సౌత్ సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం హీరోగా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.