Canara Bank : తాజాగా కెనరా బ్యాంకు ప్రకటించిన దాని ప్రకారం బ్యాంకు ఎంసీఎల్ఆర్ లో 0.10 శాతం తగ్గింపు చేసినట్లు తెలిపింది. కెనరా బ్యాంకులో కారు లోన్, వ్యక్తిగత లో ఉన్నటువంటి వినియోగదారులకు ప్రస్తుతం బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో రుణాలు చౌకగా లభించబోతున్నాయి. ఒక ఏడాది కాలపరిమితికి కెనరా బ్యాంకులో ఇప్పటివరకు MCLR 9.10 శాతం ఉండేది. తాజాగా కెనరా బ్యాంకు అదే రేటును 9% గా ప్రకటించింది. అంటే ఈ బ్యాంకులో మీరు తీసుకున్న రుణంపై కొంత భారం తగ్గబోతోంది. ఇది చిన్న మార్పు అని మీకు అనిపించవచ్చు కానీ మీరు తీసుకున్న రుణం పై దీని ప్రభావం చాలా ఉంటుంది అని తెలుస్తుంది.
మీరు చెల్లించే ఈఎంఐ లో దీని ప్రభావం ఉంటుంది. మీ డబ్బును పొదుపు చేయడంలో ఇది సహాయం చేస్తుంది. తాజాగా కెనరా బ్యాంకు ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు అలాగే ఆరు నెలల కాల పరిమితులకు సంబంధించి కూడా ఎంసీఎల్ఆర్ తగ్గించినట్లు తెలిపింది. కెనరా బ్యాంకులో ఒక రోజు కాలానికి 8.30 శాతం MCLR ఉండగా, దానిని కొత్తగా 8.20 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. మూడు నెలల కాలపరిమితికి MCLR 8.50% నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అలాగే ఆరు నెలల కాల పరిమితికి MCLR 8.90% నుంచి 8.80 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. మే 12వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి అని తెలుస్తుంది.
Also Read : అమ్మకానికి పాపులర్ బ్యాంక్.. మీకు దీంట్లో అకౌంట్ ఉందా ?
కెనరా బ్యాంకులో జరిగిన ఈ మార్పుల వలన పర్సనల్ లోన్స్ తో పాటు బిజినెస్ లోన్లు తీసుకునే వారికి కూడా తక్కువ వడ్డీ భారం ఉంటుంది. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక కీలక నిర్ణయానికి అనుసంధానంగా కెనరా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కీలక వడ్డీ రేటును 0.25% తగ్గించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6% గా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇది రెండవ తగ్గింపు. అన్ని బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే రెపో రేటును ఫాలో అవుతూ ఉంటాయి. కెనరా బ్యాంకు కూడా తాజాగా అదే దశలో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.