Ayesha Kaduskar: ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అభిమానులను నిరాశపరిచింది. ఓటీటి లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకోవడంతో రెండో సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి పెద్ది సినిమా చేస్తున్నారు. సినిమా యూనిట్ శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచి తన ఒక్కో సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా సక్సెస్ అవుతున్నారు. రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆర్ ఆర్ ఇండియా సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేస్తున్నారు.
Also Read: సుదేవ సుతం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దేవి సినిమా బాల నటుడు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్…
బుచ్చిబాబు పెద్ది సినిమాను ఊర మాస్ కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో గోవిందుడు అందరివాడేలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. చరణ్ అలాగే కాజల్ తమ నటనతో ఈ సినిమాలో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి తెలుగు పరీక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు అయేషా కాదుస్కర్.
గోవిందుడు అందరివాడేలే సినిమాలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అయేషా. ఈ సినిమాలో ఈమె కనిపించేది కొంచెం సేపు మాత్రమే అయిన కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ నటించిన సినిమా అగ్నిపత్ సినిమాతో 2012లో అయేషా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2014లో గోవిందుడు అందరివాడేలే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె మరొక తెలుగు సినిమాలో కనిపించలేదు. హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అయేషా లేటెస్ట్ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.