Devayani Career Journey: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం.. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం అతనికి మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయిన కూడా పాలిటిక్స్ లో రాణిస్తూ ఉండడం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగించిన తర్వాత ఆయన పేరు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోయింది… ప్రస్తుతం ఆయన సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఓజీ (OG) సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Sing) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈనెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: అల్లు అర్జున్ డేట్స్ కోసమే రామ్ చరణ్ పై దిల్ రాజు బ్రదర్స్ నోరు పారేసుకున్నారా..?
ఈ సినిమాతో ఇండియా వైడ్ గా ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకుంటానని పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియాలో సైతం ఈ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో సుస్వాగతం (Suswagatham) సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో అతని పక్కన హీరోయిన్ గా దేవయాని (Devayani) నటించింది. ఇక కాల క్రమేణ ఆమె కొద్ది సినిమాలు మాత్రమే చేసి ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయింది.
Also Read: అనుష్క ‘ఘాటీ’ విడుదల వాయిదా..డైరెక్టర్ క్రిష్ కొంప ముంచేశాడుగా!
ఇక ఆ తర్వాత హీరోలకు మదర్ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో అతనికి మదర్ గా నటించి మెప్పించింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించిన తను జూనియర్ ఎన్టీఆర్ కి అమ్మగా నటించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆమె మదర్ పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది…