https://oktelugu.com/

Devara overseas collections : దారుణంగా పడిపోయిన ‘దేవర’ ఓవర్సీస్ వసూళ్లు..’కల్కి’ మొదటి రోజు వసూళ్లను ఫుల్ రన్ లో దాటడం కూడా కష్టమేనా?

ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టినప్పటికీ, మూడవ రోజు మాత్రం మార్నింగ్ షోస్ నుండే కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలను నమోదు చేసుకొని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మ్యాట్నీ మరియు ఫస్ట్ షోస్ అనేక ప్రాంతాలలో మొదటి రోజుతో సమానంగా ఉన్నాయి. ప్రతీ సినిమాకి ఆదివారం నాడు ప్రదర్శితమయ్యే సెకండ్ షోస్ అత్యంత కీలకం అని చెప్పొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 05:46 PM IST

    Devara overseas collections

    Follow us on

    Devara overseas collections : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ పాన్ ఇండియన్ సినిమా అవ్వడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టినప్పటికీ, మూడవ రోజు మాత్రం మార్నింగ్ షోస్ నుండే కళ్ళు చెదిరే ఆక్యుపెన్సీలను నమోదు చేసుకొని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మ్యాట్నీ మరియు ఫస్ట్ షోస్ అనేక ప్రాంతాలలో మొదటి రోజుతో సమానంగా ఉన్నాయి. ప్రతీ సినిమాకి ఆదివారం నాడు ప్రదర్శితమయ్యే సెకండ్ షోస్ అత్యంత కీలకం అని చెప్పొచ్చు.

    ఎందుకంటే ఆ షోస్ ద్వారానే లాంగ్ రన్ నిర్ణయం అవుతుంది కాబట్టి. నేడు ‘దేవర’ కి ఎలాంటి సెకండ్ షోస్ ఉండబోతున్నాయో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి మొదటి నుండి ఓవర్సీస్ లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ వచ్చాయి. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 2.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. #RRR,కల్కి చిత్రాల తర్వాత అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన పాన్ ఇండియన్ తెలుగు సినిమాగా ‘దేవర’ చిత్రం నిల్చింది. అయితే ప్రీమియర్స్ తర్వాత ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు రాలేదనే చెప్పాలి. ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి ఈ చిత్రానికి 3.77 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కల్కి చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 5.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ‘దేవర’ చిత్రానికి ఫుల్ రన్ లో కూడా ఈ గ్రాస్ వసూళ్లను అధిగమించడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో కేవలం 6 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

    రెండు రోజులకు కలిపి 4.3 మిలియన్ డాలర్లు రాగా, ఆదివారం రోజు మరో 5 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందట. అలా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 4.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో మరో 5 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని, లాంగ్ రన్ లో ‘కల్కి’ ప్రీమియర్స్ + మొదటి రోజు రాబట్టిన గ్రాస్ వసూళ్లను ‘దేవర’ అధిగమించడం కష్టమేనని, కేవలం ప్రీమియర్ షోస్ లో తప్ప ఈ చిత్రానికి కల్కి రేంజ్ ట్రెండ్ కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. నార్త్ అమెరికా లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అవసరం ఉంది. రేపు, ఎల్లుండి లోపు బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుంది కానీ, కల్కి స్థాయి ట్రెండ్ లేదు అనేదే అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్న విషయం.