https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నాగార్జున ముందే కొట్లాడుకున్న ప్రేరణ – యష్మీ..షాక్ కి గురైన తోటి కంటెస్టెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

గత వారం యష్మీ కి నిఖిల్ టీం లోకి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, ప్రేరణ కోసం వెళ్లి త్యాగం చేసింది. మూడవ వారం లో వీళ్లిద్దరు తమ టీమ్స్ కోసం ఆడిన తీరుకి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి వరకు మామూలు రేంజ్ లో ఉన్న ఈ లేడీ టైగర్స్ గ్రాఫ్, ఒక్కసారిగా పెరిగిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 05:38 PM IST

    Bigg boss telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లేడీ టైగెర్స్ గా పిలవబడిన కంటెస్టెంట్స్ ప్రేరణ, యష్మీ. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో ప్రేరణ హీరోయిన్ గా నటించగా,యష్మీ విలన్ గా నటించింది. కానీ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి వీళ్లిద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ రావడం అందరూ గమనించారు. గత వారం యష్మీ కి నిఖిల్ టీం లోకి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, ప్రేరణ కోసం వెళ్లి త్యాగం చేసింది. మూడవ వారం లో వీళ్లిద్దరు తమ టీమ్స్ కోసం ఆడిన తీరుకి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి వరకు మామూలు రేంజ్ లో ఉన్న ఈ లేడీ టైగర్స్ గ్రాఫ్, ఒక్కసారిగా పెరిగిపోయింది. వీళ్ళ ఆట తీరుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

    అయితే నాల్గవ వారం లో వీళ్లిద్దరి గేమ్ ఆశించిన స్థాయిలో బయటపడలేదు కానీ, నెగటివిటీ ని మాత్రం సంపాదించుకోలేదు. ఇది ఇలా ఉండగా నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో వీళ్లిద్దరు పోటీ పడి ఆడడం హైలైట్ గా నిల్చింది. ఈ ప్రోమో లో నాగార్జున ‘ట్యూన్ పట్టు..గెస్ కొట్టు’ అనే గేమ్ కంటెస్టెంట్స్ తో ఆడుతాడు. ఇరు క్లాన్ సబ్యులకు సంబంధించి చెరో ఒకరు ఈ గేమ్ లో ఆడాల్సి ఉంటుంది. ఎదురుగా ఒక బోర్డు ఉంటుంది, క్రింద హీరో,హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. పాట రాగానే ఆ పాటలో నటించిన హీరో హీరోయిన్ల ఫోటోలను బోర్డుకు తగిలించాలి. ముందుగా హలో బ్రదర్ నుండి ‘ప్రియరాగాలే’ సాంగ్ ని వేస్తాడు బిగ్ బాస్. కాంతారా టీం నుండి విష్ణు ప్రియా, శక్తి టీం నుండి పృథ్వీ వస్తారు. ఈ రౌండ్ లో విష్ణు ప్రియా నాగార్జున, సౌందర్య ఫోటోలను బోర్డుకు తగిలించి పాయింట్లు కొట్టేస్తుంది. ఇక ఆ తర్వాత ‘ఘర్షణ’ చిత్రం నుండి ‘చెలియ..చెలియా’ సాంగ్ వస్తుంది. ఈ రౌండ్ కు కాంతారా టీం నుండి ప్రేరణ, శక్తి టీం నుండి యష్మీ వస్తారు. యష్మీ చేతిలో వెంకటేష్ బొమ్మ ఉంటుంది, అలాగే ప్రేరణ చేతిలో హీరోయిన్ ఆసిన్ బొమ్మ ఉంటుంది.

    ప్రేరణ యష్మీ తో మాట్లాడుతూ ‘ఇది ఏ సినిమాలోని సాంగ్ చెప్పురా చూద్దాం’ అంటుంది. అప్పుడు యష్మీ ‘నువ్వు చెప్పు చూద్దాం’ అంటుంది. అప్పుడు ప్రేరణ ‘చెలియ..చెలియా’ పాట పాడుతుంది. అప్పుడు యష్మీ ప్రేరణ ని వెక్కిరిస్తున్న సమయంలో ప్రేరణ యష్మీ నుండి వెంకటేష్ బొమ్మ ని కొట్టేస్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. బోర్డు కూడా ఊగిపోతాది. ఇదంతా చూసి హౌస్ మేట్స్ ‘వామ్మో’ అని అనుకుంటారు. ఇదంతా సరదాగానే సాగిపోతుంది. వీళ్లిద్దరి తోపులాట చూసేందుకు చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ రౌండ్ లో కాంతారా టీం గెలుస్తుంది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.