Devara: దేవర విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తుంది. యూఎస్ లో దేవర ప్రీ రిలీజ్ సేల్స్ $2 మిలియన్ క్రాస్ చేశాయి. ఆస్ట్రేలియాలో సైతం దేవరకు భారీ రెస్పాన్స్ దక్కుతుంది. ఇక బుక్ మై షోలో దేవర టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వరల్డ్ వైడ్ దేవర రూ. 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దేవర రూ. 400 కోట్ల వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగుతుంది. సెప్టెంబర్ 27న దేవర వరల్డ్ వైడ్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతుంది. 26 అర్ధరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన మొదలు కానుంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ అలరించనున్నాడు. ఎన్టీఆర్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన విలన్ భైర పాత్రలో సైఫ్ అలీఖాన్ మైండ్ బ్లాక్ చేయనున్నాడు. శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా దేవర తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
కాగా దేవర డిజిటల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్సీ ధర చెల్లించి నెట్ఫ్లిక్స్ దేవర తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ హక్కులు దక్కించుకుంది. మొత్తంగా దేవర హక్కులు రూ. 155 కోట్లు పలికాయని సమాచారం. కాగా దేవర ఓటీటీ విడుదల విషయంలో ఒప్పందం కుదిరిందట. సాధారణంగా థియేట్రికల్ విడుదల అనంతరం నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేస్తారు.
స్టార్ హీరోలు, భారీ విజయం సాధించిన చిత్రాలను మరో రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే దేవర మాత్రం 8 వారాల అనంతరం అందుబాటులోకి రానుందట. ఏకంగా విడుదలైన రెండు నెలలకు అంటే… నవంబర్ చివరి వారంలో దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.