Chiranjeevi: చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగి ఉన్నారు. ఆయన నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి 46 ఏళ్ళు అవుతుంది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం సాధించాడు. 156 సినిమాల్లో ఐదు వందలకు పైగా పాటల్లో నృత్యం చేసిన చిరంజీవి… 24000 స్టెప్స్ వేశారు. ఈ అరుదైన ఘనత అందుకున్న హీరో మరొకరు లేరు. దీంతో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. ఇక నాలుగు తరాల హీరోయిన్స్ తో నటించిన ఘనత చిరంజీవి సొంతం.
జయసుధ నుండి తమన్నా వరకు పదుల సంఖ్యలో హీరోయిన్స్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే చిరంజీవికి వివాహం జరిగింది. 1978లో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలైంది. 1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి ఏడడుగులు వేశారు. సురేఖను పెళ్లి చేసుకోక ముందు చిరంజీవి ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. ఆమెను పిచ్చిగా ప్రేమించాడట. ఓ సందర్భంలో చిరంజీవి తన ఫస్ట్ లవ్ ఎవరో తెలియజేశాడు.
లాల్ సింగ్ చద్దా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం అమిర్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సైతం ఓ రోల్ చేశారు. ఈ క్రమంలో చిరంజీవి, నాగ చైతన్య, నాగార్జున, అమిర్ ఖాన్ ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో అమిర్ ఖాన్… మీరు మొదటిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అని చిరంజీవిని అడిగారు. అందుకే చిరంజీవి నవ్వేశాడు.
నా ఫస్ట్ లవ్ అంటే.. 7వ తరగతిలో. ఓ అమ్మాయి రోజు సైకిల్ తొక్కుతూ స్కూల్ కి వెళ్ళేది. ఆ రోజుల్లో మా మొగల్తూరులో ఆడపిల్ల సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ అమ్మాయితో నాకు పరిచయం, చనువు ఉన్నాయి. నాకు సైకిల్ తొక్కడం వచ్చు కానీ, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. నాకు కూడా సైకిల్ నేర్పుతావా? అని ఆ అమ్మాయిని అడిగాను.
నేను సైకిల్ తొక్కుతుంటే ఆ అమ్మాయి వెనుక పట్టుకునేది. నేనేమో ఆ అమ్మాయిని చూడటానికి వెనక్కి తిరిగేవాడిని. ఆ అమ్మాయి ముందుకు చూడు అనేది. పేరు చెప్పను కానీ.. ఆమెనే నా ఫస్ట్ లవ్ అని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఇది 2025 జనవరి 10న విడుదల కానుంది.