https://oktelugu.com/

Devara movie on Netflix : నెట్ ఫ్లిక్స్ లో ‘దేవర’ ప్రభంజనం..డేంజర్ లో పడిన #RRR రికార్డు..2 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతో తెలిస్తే నోరెళ్లెబెడుతారు!

నెట్ ఫ్లిక్స్ లో ఒక సినిమాకి 2 మిలియన్ వ్యూస్ రావాలంటే వారం రోజులు పడుతుంది. కానీ 'దేవర' చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది ఇండియన్ సినిమాలలో ఆల్ టైం రికార్డు అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 06:10 PM IST

    Devara movie on Netflix

    Follow us on

    Devara movie on Netflix :  ఈ ఏడాదిని నందమూరి అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఒకపక్క తాము అభిమానించే రాజకీయ పార్టీ తెలుగు దేశం అధికారంలోకి రావడం, మరోపక్క తాము అభిమానించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడం. ఈ రెండు ఒకే ఏడాది రావడం నిజంగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిందాని పోస్టర్స్ అయితే విడుదల చేసారు కానీ, నిజానికి 400 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. రాజమౌళి తో సినిమా తీసిన తర్వాత, అందులో నటించే హీరోకి పెద్ద ఫ్లాప్ వస్తుంది అని ఒక సెంటిమెంట్ ఉంది.

    కానీ ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ తన స్టార్ స్టేటస్ తో బ్రేక్ చేసాడు అనే చెప్పాలి. 43 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే గణనీయమైన సెంటర్స్ లో అర్థ శత దినోత్సవం ని జరుపుకోనుంది. ఇదంతా పక్కన పెడితే నవంబర్ 8వ తారీఖున ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ నటించిన #RRR కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళు ఒక రేంజ్ లో చూసారు. అందుకే ఈ చిత్రానికి హాలీవుడ్ లో కూడా గుర్తింపు లభించింది. ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో #RRR కి ఆ రేంజ్ వ్యూస్ వచ్చాయి కాబట్టే ఎన్టీఆర్ కి మంచి రీచ్ వచ్చింది, ఆ రీచ్ దేవర చిత్రానికి ఉపయోగపడింది.

    సాధారణంగా నెట్ ఫ్లిక్స్ లో ఒక సినిమాకి 2 మిలియన్ వ్యూస్ రావాలంటే వారం రోజులు పడుతుంది. కానీ ‘దేవర’ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది ఇండియన్ సినిమాలలో ఆల్ టైం రికార్డు అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ సినిమాకి సంబంధించిన హిందీ వెర్షన్ ని ఇంకా నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేయలేదు. హిందీ వెర్షన్ అప్లోడ్ చేసిన తర్వాత #RRR తరహాలో ఈ సినిమా కూడా ఏడాది పాటు ట్రెండింగ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ‘దేవర’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి ‘వార్ 2’ విడుదల కాబోతుంది. హ్రితిక్ రోషన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవడ్ లో తన జెండా ని చాలా బలంగా పాతబొతున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమాతో పాటు ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేయబోతున్నాడు.