https://oktelugu.com/

Game Changer Teaser : చరిత్ర తిరగరాసిన ‘గేమ్ చేంజర్’ టీజర్..24 గంటల్లో ఇన్ని వ్యూస్ ఎలా సామీ?..ఇండియాలో మరో సినిమా దరిదాపుల్లో లేదు!

యూట్యూబ్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అంటే ఇదే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానుల సంతోషం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడు విభిన్నమైన గెటప్స్ తో అభిమానుల ఇన్నేళ్ల ఎదురుచూపులకు న్యాయం జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 06:00 PM IST

    Game Changer Teaser

    Follow us on

    Game Changer Teaser : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవుతున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటి నుండే మొదలయ్యాయి. నిన్న ఈ సినిమా టీజర్ ని లక్నో లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టీజర్ ని ప్లే చేసారట. అభిమానులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేసారు. యూట్యూబ్ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. శంకర్ మార్క్ కమర్షియల్ సినిమా అంటే ఇదే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానుల సంతోషం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడు విభిన్నమైన గెటప్స్ తో అభిమానుల ఇన్నేళ్ల ఎదురుచూపులకు న్యాయం జరిగింది.

    ఇది ఇలా ఉండగా యూట్యూబ్ లో ఈ టీజర్ సృష్టిస్తున్న రికార్డులను చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం ఒక్క తెలుగు వెర్షన్ లోనే 37 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా హిందీ లో 10 మిలియన్ వ్యూస్, తమిళం లో 3 మిలియన్ వ్యూస్, మొత్తం మీద మూడు భాషలకు కలిపి 50 మిలియన్ వ్యూస్ ఈ టీజర్ కి వచ్చాయి. ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు విశ్లేషకులు. గతం లో ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ టీజర్ కి 42 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టింది ‘గేమ్ చేంజర్’ టీజర్. రీసెంట్ గా విడుదలైన టీజర్స్ లో టాప్ 5 వ్యూస్ సాధించిన టీజర్స్ లిస్ట్ చూస్తే ‘గేమ్ చేంజర్’, ‘రాధే శ్యామ్’ తర్వాత ‘దేవర’ చిత్రం నిల్చింది. మొదటి రోజు ఈ సినిమా టీజర్ కి 26 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వార పుష్ప 2 టీజర్ 20 మిలియన్ వ్యూస్ తో టాప్ 4 స్థానంలోనూ, పవన్ కళ్యాణ్ ఓజీ 15 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 స్థానంలోనూ నిల్చింది.

    అయితే శంకర్ కి తమిళం లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. కానీ ఆయన క్రేజ్ కి తగ్గ వ్యూస్ మాత్రం రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 24 గంటల్లో కేవలం 3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ వ్యూస్ కూడా ఇంకా అప్డేట్ కాలేదు. శంకర్ గత చిత్రం ఇండియన్ 2 భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ gaa నిల్చింది. దీంతో తమిళనాడు లో ప్రస్తుతానికి అయితే ‘గేమ్ చెంజర్’కి పెద్దగా అంచనాలు లేవు. టీజర్ కి కూడా అక్కడి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రివ్యూస్ వచ్చింది. మరి ట్రైలర్ తో అక్కడి ఆడియన్స్ అభిప్రాయాలు మారుతాయో లేదో చూడాలి.