https://oktelugu.com/

Sobhita Dhulipala: నాగ చైతన్య తో నిశ్చితార్థం తర్వాత సమంత శోభితకు అలాంటి మెసేజ్ పెట్టిందా?..వైరల్ అవుతున్న శోభిత కామెంట్స్!

ఇంటర్ చదివే సమయంలో ఆర్థికంగా ఎక్కువగా వార్తలు వినేవారంట. ఆ సమయంలో రాష్ట్రపతి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలని కలలు కన్నారట. సినీ ఇండస్ట్రీకి వస్తానని, అసలు అనుకోలేదట.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 05:08 PM IST
    Follow us on

    Sobhita Dhulipala:  శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్ ఇండియా పోటీలో గెలిచి.. మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి హాలీవుడ్‌లో రాణిస్తోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ రోజుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌, ఓటీటీలోనూ, హాలీవుడ్‌లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈమె పెళ్లి కూడా రెడీ అవ్వబోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వూలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినీ రంగంలోకి ఎలా వచ్చింది? పడిన ఇబ్బందులు అన్ని తెలియజేశారు. ఎలాంటి లక్ష్యం లేకుండానే సినిమా రంగంలోకి వచ్చానని, మోడల్‌ కావాలని ఆడిషన్స్‌కి వెళ్లేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆ సమయంలో బాధపెట్టిన సంఘటనలే ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచాయని శోభిత తెలిపారు. తెనాలిలో పుట్టిన ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ముంబాయికి షిఫ్ట్ అయ్యినట్లు తెలిపారు.

    రాష్ట్రపతి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలనకున్నా..
    ఇంటర్ చదివే సమయంలో ఆర్థికంగా ఎక్కువగా వార్తలు వినేవారంట. ఆ సమయంలో రాష్ట్రపతి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేయాలని కలలు కన్నారట. సినీ ఇండస్ట్రీకి వస్తానని, అసలు అనుకోలేదట. వైజాగ్ నుంచి ముంబాయి చేరిన తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశానని బోల్డ్ బ్యూటీ చెబుతోంది. ఇలా ఓసారి షాంపూ యాడ్ కోసం వెళ్తే.. నల్లగా ఉన్నావు, మోడలింగ్‌గా పనికిరానన్నారు. ఇలాంటి సందర్భాల్లో బాధపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దాదాపుగా 100 ఆడిషన్స్ తర్వాత అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0లో అవకాశం వచ్చిందని తెలిపారు. ఒకప్పుడు వద్దన్న యాడ్ మళ్లీ నటించమన్నారని తెలిపారు.

    సమంత నా సోల్‌మేట్..
    చెల్లి సమంత తన సోల్‌మేట్ అని శోభిత ఇంటర్వూలో తెలిపింది. ఈ మధ్యనే తనకు పెళ్లి అయ్యిందని, కెరీర్ వల్ల అందరికీ దూరంగా ఉన్నట్లు తెలిపారు. చెల్లి పెళ్లిలో అందరిని కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. పెళ్లి మండపంలో అందంగా రెడీ అయ్యి కూర్చున్న సమంతను చూస్తే.. ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయని, తన జీవితంలో బెస్ట్ మూమెంట్స్‌లో ఇది ఒకటని ఆమె ఓ ఇంటర్వూలో తెలిపారు. శోభిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత నా సోల్‌మేట్ అంటుంటే అందరూ సమంత రుతుప్రభు గురించి ఏమో అని భావించారు. కానీ శోభిత చెప్పేది తన సొంత చెల్లి గురించి. ఆమె పేరు కూడా సమంతానే. ఈ ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభితా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నారు. తనకు వంటలు చేయడం అంటే ఇష్టమని, వెజ్‌టేరియన్ అని ఆమె తెలిపారు. బయటకు ఎక్కడికి వెళ్లిన కూడా తనే వంట చేసుకుని తీసుకెళ్తారని ఆమె ఇటీవల ఇంటర్వూలో పంచుకున్నారు.