Devara : ‘కల్కి’ చిత్రం తర్వాత మన టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు. మంచి సినిమా వస్తే థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు కానీ సినిమాలే రావడం లేదు. నిన్న విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలపై ట్రేడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ రెండు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి పోటీ పడీమరీ డిజాస్టర్ ఫ్లాప్ టాక్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ మళ్ళీ గాడిలో పడాలంటే ఒక టాప్ స్టార్ హీరో సినిమా విడుదల అవ్వాలి, ఆ సినిమా దగ్గరలో మనకి కనిపిస్తున్నది ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మాత్రమే. ఈ చిత్రం మీద రోజు రోజుకి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. పది రోజుల క్రితం విడుదలైన రెండవ పాట ‘చుట్టమల్లే’ కి దాదాపుగా 60 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక గత ఏడాది ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ వీడియో కి కూడా అదే తరహా రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ చిత్రం లో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. ఈ వీడియో కి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ లుక్స్, ఆయన చేసే ఫైట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా కుస్తీ ఫైట్ లో ఆయన ఒక్కొక్కరిని గాల్లోకి విసిరేస్తున్నాడు. అంటే కాదు సైఫ్ అలీ ఖాన్ కి ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉన్నట్టు ఈ గ్లిమ్స్ వీడియో లో చూస్తే అర్థం అవుతుంది. మొత్తం మీద కొరటాల శివ ఇందులో సైఫ్ అలీ ఖాన్ ని ఒక రెగ్యులర్ విలన్ లాగ కాకుండా, హీరో తో సరిసమానంగా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో హీరో ని కూడా డామినేట్ చేసేలా ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇక ఈ సినిమాకి అనిరుద్ ప్రాణం పెట్టేసినట్టు కళ్ళకి కనిపిస్తుంది.
ఇప్పటికే ఆయన అందించిన రెండు పాటలకు సోషల్ మీడియా ఊగిపోతోంది,అలాగే మొదటి గ్లిమ్స్ వీడియో కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. హీరో కి మాత్రమే కాదు, నేడు విలన్ గ్లిమ్స్ వీడియో కి కూడా ఆయన అదిరిపోయే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇలా అన్నీ విధాలుగా దేవర నుండి వస్తున్న ప్రతీ కంటెంట్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. మరి తారాస్థాయికి చేరిన ఈ అంచనాలను దేవర అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే నెల 27 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. వచ్చే వారం లో ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాటని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.