Nagarjuna-Sandeep Reddy Vanga : నాగార్జున, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అదేనా.. అర్జున్ రెడ్డి మొదటి సినిమా కాదా?

గతంలో ఆయన అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అలా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన 'కేడి' అనే చిత్రానికి కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అంతే కాదు ఆయన ఆ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు కూడా. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Written By: Vicky, Updated On : October 24, 2024 9:28 pm

Nagarjuna-Sandeep Reddy Vanga Combination

Follow us on

Nagarjuna-Sandeep Reddy Vanga : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో రాజమౌళి కి సరిసమానంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న దర్శకులలో ఒకరు సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ ని షేక్ చేసిన ఈయన, బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’, ‘ఎనిమల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని అక్కడ కూడా జెండా పాతేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిభ కి హద్దులు లేవు అనడానికి నిదర్శనం సందీప్ రెడ్డి వంగ. ప్రతీ మనిషిలోనూ బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. వాటిని బయట పెట్టడానికి మనం మొహమాటం పడుతూ ఉంటాము. కానీ తనకి వచ్చిన ప్రతీ బోల్డ్ ఆలోచనని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో సందీప్ వంగ సిద్ధహస్తుడు. అందుకే యూత్ ఆడియన్స్ ఆయనకు అంతలా కనెక్ట్ అయ్యారు.

రాజమౌళి కి అయినా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందడానికి దశాబ్దానికి పైగా సమయం పట్టింది కానీ, సందీప్ వంగ కి కేవలం 5 ఏళ్ళ సమయం మాత్రమే పట్టింది. ప్రస్తుతం ఈయనతో సినిమాలు చేయడం కోసం పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో సందీప్ వంగ ఒక్క సినిమా చేస్తే చాలు అని కోరుకుంటున్నారు. ఈ స్థాయికి ఎదగడానికి సందీప్ వంగ కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. గతంలో ఆయన అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అలా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘కేడి’ అనే చిత్రానికి కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అంతే కాదు ఆయన ఆ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు కూడా. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ సినిమా ఆరోజుల్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇందులో సందీప్ వంగ పలు సన్నివేశాలకు దర్శకత్వం కూడా వహించాడట. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ, ఆరోజుల్లో రావాల్సిన సినిమా కాదు. ఇప్పుడు విడుదల అయ్యుంటే కచ్చితంగా సూపర్ హిట్ స్టేటస్ ని దక్కించుకునేది. అలా అర్జున్ రెడ్డి కి ముందే సందీప్ వంగ ఈ సినిమా ద్వారా ఆడియన్స్ కి పరిచయమయ్యాడు. ఇదంతా పక్కన పెడితే సందీప్ వంగ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ఎనిమల్ పార్క్’. ఎనిమల్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. అలాగే ప్రభాస్ తో ఆయన ‘స్పిరిట్’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఇందులో ప్రభాస్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు సందీప్. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన అల్లు అర్జున్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇది ఇప్పట్లో ఉండదు కానీ, ప్రస్తుతానికి ఈ మూడు సినిమాల్లో సందీప్ వంగ ‘ఎనిమల్ పార్క్’ ముందుగా చేసే అవకాశాలు ఉన్నాయి.