Devara: దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా దేవర మూవీతో వస్తున్నారు. ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఎన్టీఆర్ ఏకంగా 4 ఏళ్ళు కేటాయించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ సైతం విడుదలై రెండేళ్లు దాటిపోతుంది. ఎన్టీఆర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.
దేవరకు ఆడియన్స్ లో ఎంత డిమాండ్ ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. యూఎస్ లో దేవర బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సత్తా చాటుతుంది. విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండగా.. $ 1.5 మిలియన్ మార్క్ చేరుకుంది. కెనడా బుకింగ్స్ పరిగణలోకి తీసుకోకుండానే దేవర ఈ రేంజ్ వసూళ్లు అందుకుంది.
కాగా టెక్సాస్ లో ప్రీమియర్స్ ద్వారానే $ 1 మిలియన్ వసూళ్లకు దేవర చేరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ రికార్డు నమోదు చేసిన తొలి తెలుగు చిత్రం దేవర అవుతుంది. తాజా సమాచారం ప్రకారం $500000 వసూలు చేసింది. కల్కి 2898 AD మూవీ టెక్సాస్ లో ప్రీమియర్స్ సేల్స్ ద్వారా $700000 వసూలు చేసింది. ప్రీ సేల్స్ వసూళ్ళలో కల్కి చిత్రాన్ని టెక్సాస్ లో దేవర అధిగమించే సూచనలు కలవు.
ఇక తెలుగువారు అధికంగా ఉండే డల్లాస్ లో 24 గంటలు షోస్ ఏర్పాటు చేశారు. దేవర చిత్రంతో ఎన్టీఆర్ తన గత చిత్రాల(ఆర్ ఆర్ ఆర్ కాకుండా) రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశారు.
అనిరుద్ మ్యూజిక్ అందించారు. దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దేవర చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. నార్త్ ఇండియాలో సైతం దేవర చిత్రానికి డిమాండ్ ఏర్పడింది. మరి చూడాలి దేవర తో ఎన్టీఆర్ ఈ స్థాయి విజయం నమోదు చేస్తాడో…