Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వైవిధ్యమైన కథాంశాలతో హీరోలు సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో మాత్రం మాస్ కమర్షియల్ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి క్రమంలో ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్లో కొంతవరకు అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ అంచనాల మధ్య దేవర ట్రైలర్ రిలీజ్ అయితే ఆ ట్రైలర్ ఏమాత్రం ప్రేక్షకుడిని సాటిస్ఫై చేసే విధంగా లేకపోవడం ట్రైలర్ మొత్తం కన్ఫ్యూజన్ తో నిండిపోయింది. దాంతో సగటు ప్రేక్షకుడికి ఎన్టీఆర్ ఈ సినిమా ఎందుకు చేస్తున్నాడా అనే ఒక డౌట్ కూడా వస్తుంది.
కాబట్టి ఈ సినిమా విషయంలో మాత్రం ఎన్టీఆర్ కొంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ట్రైలర్ చూసిన సగటు సినీ మేధావులు సైతం ఈ సినిమా మరో ‘ఆంధ్ర వాలా’ కాబోతుందా? అంటూ కామెంట్లైతే చేస్తున్నారు. ఆంధ్రవాలా సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రను పోషించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తూ తండ్రి కొడుకుల పాత్రలను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాని కొరటాల శివ విజువల్ వండర్ గా చూపిస్తున్నారు అని అందరు అనుకున్నారు. కానీ ట్రైలర్ చూస్తేనే అందులో ఉన్న గ్రాఫిక్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఎలివేషన్స్, ఎమోషన్స్ కూడా అంత బాగా వర్కౌట్ అయినట్టుగా కనిపించడం లేదు. మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా మీద ఎలా రెస్పాండ్ అవుతాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక వరుసగా ఏడు సక్సెస్ లను అందుకొని ఇప్పుడున్న స్టార్ హీరోలు ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు.
ఇక ఈ క్రమంలో దేవర మాత్రం ఆయన ఆశల మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ప్రేక్షకులు ఈ సినిమాతో ఎన్టీయార్ కి భారీ సక్సెస్ ను అందిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…